SSMB29 బిగ్ అప్డేట్.. మూవీ  టైటిల్ ఇదేనట! ఎవరూ ఊహించలేరు

మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే మూవీ సెట్స్ నుంచి లీకైన మహేష్ బాబు వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేసింది.

New Update
SSMB29

SSMB29

SSMB29: మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే మూవీ సెట్స్ నుంచి లీకైన మహేష్ బాబు వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఇందులో మహేష్ బాబు సింహంతో కలిసి నడుస్తున్న విజువల్స్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నవంబర్ లో SSMB29 నుంచి ఫస్ట్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు రాజమౌళి తెలిపారు.

టైటిల్ అప్డేట్ 

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం 'వారణాసి' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా SSMB29 ఒక యాక్షన్ అడ్వెంచర్ కథగా  ఉండబోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇటీవలే రాజమౌళి విడుదల చేసిన మహేష్ బాబు పోస్టర్ తో ప్రేక్షకుల ఊహాగానాలు మరో మలుపు తీసుకున్నాయి. పోస్టర్ లో  మహేష్ బాబు నంది, త్రిశూలం, డమరుకంతో  శివుడికి సంబంధించిన అంశాలు ఉన్న లాకెట్ మెడలో ధరించి కనిపించారు. దీంతో ఈ సినిమా ఆధ్యాత్మిక, పౌరాణిక ఇతివృత్తంతో కూడిన అంశాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్.  దీంతో పాటు 'గ్లోబ్ ట్రోట్టర్' అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఎందుకంటే  ఇందులో మహేష్  బాబు ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నారట. 

Also Read: Rashmika: అవన్నీ ఫేక్ వార్తలే.. విజయ్ తో ఎంగేజ్మెంట్ వేళ రష్మిక షాకింగ్ వీడియో!

Advertisment
తాజా కథనాలు