ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రష్మిక మాట్లాడుతూ.. సినిమా విడుదలైన మొదటి రెండు మూడు రోజుల్లో నేను బిజీగా ఉండడంతో సినిమా చూడలేదు. కానీ, ఆ తర్వాత సినిమా చూశాను. వెంటనే చిత్రబృందానికి మెసేజ్ కూడా పంపాను. తిరిగి వాళ్ళు నాకు కృతజ్ఞతలు కూడా తెలిపారు అంటూ చెప్పుకొచ్చింది.
Rashmika: అవన్నీ ఫేక్ వార్తలే.. విజయ్ తో ఎంగేజ్మెంట్ వేళ రష్మిక షాకింగ్ వీడియో!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మను కన్నడ సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందనే వార్త చాలాకాలంగా ప్రచారంలో ఉంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మను కన్నడ సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందనే చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు రిషబ్ శెట్టి 'కాంతారా' సినిమా విడుదలతో ఈ వార్త మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
అయితే రష్మిక 2016లో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన 'కిరిక్ పార్టీ' సినిమాతో సినీ ప్రపంచానికి పరిచయమైంది. దీంతో రష్మిక 'కాంతారా' గురించి ఇంకా స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. రశ్మికకు కనీస కృతజ్ఞత లేదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్లు.
ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రష్మిక మాట్లాడుతూ.. సినిమా విడుదలైన మొదటి రెండు మూడు రోజుల్లో నేను బిజీగా ఉండడంతో సినిమా చూడలేదు. కానీ, ఆ తర్వాత సినిమా చూశాను. వెంటనే చిత్రబృందానికి మెసేజ్ కూడా పంపాను. తిరిగి వాళ్ళు నాకు కృతజ్ఞతలు కూడా తెలిపారు అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే తనను కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారంటూ వస్తున్న వార్తలపై కూడా ఈ వీడియోలో స్పందించింది. నన్ను ఎవరూ బ్యాన్ చేయలేదు.. అవన్నీ కూడా అవాస్తవాలు, ఫేక్ వార్తలు అంటూ నవ్వుతూ బదులిచ్చింది.
ఇదిలా ఉంటే.. రష్మిక- విజయ్ తమ ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ.. వివాహ బంధంలోకి అడుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా ప్రైవేట్ గా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
దీనిపై విజయ లేదా రష్మిక నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట వివాహం జరగనున్నట్లు సమాచారం.