/rtv/media/media_files/2025/11/08/mahesh-babu-niece-2025-11-08-20-14-54.jpg)
Mahesh Babu Niece
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనకోడలు, నటి, ప్రొడ్యూసర్ మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలో హీరోయిన్‌గా వెండితెరపై మెరిసేందుకు రెడీ అయింది. ఇదే విషయాన్ని ఇటీవల మంజుల సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు.
Mahesh Babu Niece
ఇందులో భాగంగానే జాన్వీ స్వరూప్ తాజాగా తన టాలెంట్‌ను కెమెరా ముందు ప్రదర్శించింది. మొదటి సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఆమె చేసిన యాడ్స్, ఫొటో షూట్‌లు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఆమె ఒక యాడ్‌లో నటించింది. అందులో లెహంగా ధరించి.. లగ్జరీ ఖరీదైన డైమండ్ నక్లస్‌తో కనిపించిన లుక్ ఓ రేంజ్‌లో ఉంది. అదే యాడ్‌లో జాన్వీ సాంప్రదాయ పట్టు చీరలో.. టెంపుల్ గోల్డ్ జ్యూవెలరీతో కనిపించి మైమరపించింది.
ఈ రెండు వేరియేషన్లలో జాన్వీ తన అందం, అభినయంతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మత్తెక్కించే కళ్లు, నాజూకైన రూపం ఆమె అందానికి వన్నెతెచ్చాయి. దీని బట్టి చూస్తే ఆమె టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
కాగా జాన్వీ స్వరూప్‌కు నటనేమి కొత్త కాదు. ఆమె తన చిన్నతనంలోనే ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. 2018లో ‘మనసుకు నచ్చింది’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒక చిన్న పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రానికి ఆమె తల్లి మంజుల దర్శకత్వం వహించగా.. మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. అప్పుడు చైల్డ్ ఆర్టిగా రాణించిన జాన్వీ.. ఇప్పుడు మైమరపించే అందంతో ప్రేక్షకుల ముందుకు హీరోయిన్‌గా రానుండటంతో.. ఆమె నటన కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Follow Us