Ram Charan: లండన్ లో చరణ్ కి గ్రాండ్ వెల్కమ్.. మేడమ్ టుసాడ్స్ లో మైనపు విగ్రహం ఓపెనింగ్

మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా చరణ్ తన తండ్రి మెగాస్టార్, కుటుంబ సభ్యులతో లండన్ చేరుకున్నారు. లండన్ లోని అభిమానులు చరణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

New Update

Ram Charan:  టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని రేపు మేడమ్ టుసాడ్స్ లండన్ లో ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ చేరుకున్నారు. దీంతో లండన్ లోని చరణ్ అభిమానులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బ్యాండ్, భాజాలతో హర్షద్వానాలతో స్వాగతం పలికారు. చరణ్ కారులో నుంచి తన అభిమానులకు అభివాదం చేస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మొదటి సెలబ్రిటీ

రామ్ చరణ్‌తో పాటు ఆయన పెంపుడు కుక్క “రైమ్”కి  ఈ విగ్రహంలో చోటు దక్కింది. పెంపుడు కుక్కతో   కలిసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం పొందిన మొదటి సెలబ్రిటీగా చరణ్ చరిత్ర సృష్టించారు. మొదట రామ్ చరణ్ wax విగ్రహాన్ని సింగపూర్‌లో పెట్టనున్నట్లు  వార్తలు వచ్చాయి.  కానీ ఆ తర్వాత  లండన్‌లోనే ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. 


2024 సెప్టెంబర్లో మేడమ్ టుసాడ్స్ టీమ్ చరణ్ శరీర కొలతలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం..  నేను రామ్ చరణ్. మేడమ్ టుసాడ్స్ కుటుంబంలో చేరడం నాకు గొప్ప గౌరవంగా ఉంది. త్వరలో నా విగ్రహాన్ని మీరు చూడబోతున్నారు." 

ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్ బుచ్చి బాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో 2026 మార్చి 27న విడుదల కానున్నట్లు సమాచారం.  ఇందులో జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేంద్రూ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

telugu-news | latest-news | cinema-news

Advertisment
తాజా కథనాలు