HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి మోదీ, మెగాస్టార్ బర్త్ డే విషెస్.. వైరలవుతున్న ట్వీట్లు!

నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెష్ వెలువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి సినీతారలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల వరకు పవన్ కి విషెష్ తెలియజేస్తున్నారు.

New Update
HBD Pawan kalyan

HBD Pawan kalyan

HBD Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెష్ వెలువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి సినీతారలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల వరకు పవన్ కి విషెష్ తెలియజేస్తున్నారు. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు.  శ్రీ పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకంక్షాలు. ఎంతో మంది ప్రజల హృదయాల్లో, మనస్సులో ముద్ర వేశారు పవన్. సుపరిపాలనపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయేను బలోపేతం చేస్తున్నారు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. 

మెగా స్టార్ విషెష్

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముడి కోసం బ్యూటిఫుల్ విషెష్ తెలియజేశారు.  ''చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.  ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను.🤍 దీర్ఘాయుష్మాన్ భవ! 
@PawanKalyan'' అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి 

చంద్రబాబు నాయుడు విషెస్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మిత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. అణువణువునా సామాజిక స్పృహ, అడుగడుగునా సామాన్యుడి పక్షం, మాటల్లో పదును,మాటకు కట్టుబడే తత్వం, చేతుల్లో చేవ, రాజకీయాల్లో విలువలకు పట్టం, స్పందించే హృదయం, జన సైన్యానికి ధైర్యం అన్నీ కలిస్తే  పవనిజం అని నమ్మే అభిమానులు, కార్యకర్తల ఆశీర్వాదాలతో నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని ట్వీట్ చేశారు. 

నారా లోకేష్ 

సొంత తమ్ముడి కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, నాకు అండగా నిలిచిన మా పవన్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు లోకేష్. 

Also Read: Ustaad Bhagat Singh: రేపు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి కిక్కిచ్చే అప్డేట్!

Advertisment
తాజా కథనాలు