/rtv/media/media_files/2025/09/27/koratala-siva-2025-09-27-19-24-36.jpg)
Koratala Siva
Koratala Siva: టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ ఇటీవలి కాలంలో చేసిన 'ఆచార్య' చిత్రం భారీ నిరాశను మిగిల్చినా, తర్వాత వచ్చిన 'దేవర' చిత్రం కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించింది. కథ పై విమర్శలు ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ స్టార్ పవర్ సినిమా విజయం సాధించేందుకు తోడైంది.
ఇప్పుడు కొరటాల శివ తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. కొంతకాలంగా నాగచైతన్యతో సినిమా చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే అవి పూర్తిగా రూమర్సే అని స్పష్టమైంది.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
Koratala Siva - Balakrishna
తాజాగా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న బజ్ ప్రకారం, కొరటాల శివ తన కొత్త సినిమాను నందమూరి బాలకృష్ణతో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
ఇదిలా ఉండగా, కొరటాల శివకు ముందుగా 'దేవర 2' సినిమా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. దీంతో 'దేవర 2' షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో క్లారిటీ లేదు.
Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఈ గ్యాప్‌లో కొరటాల శివ ఒక తక్కువ కాలంలో పూర్తి అయ్యే ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అదే తరహాలో బాలయ్యతో కలిసి ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దింతో, ఇప్పుడు ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నది - ఈ కాంబినేషన్ నిజంగా రియలిటీ అవుతుందా? లేదా ? అని దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.