నాగ చైతన్య - సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జున ఆమెపై క్రిమినల్ కేసుతోపాటు, పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ మంగళవారం జరిగింది. అందులో భాగంగా నాగార్జున..' మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారు.
అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని కూడా అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశ్యం తోనే మంత్రి ఇలాంటి వాఖ్యలు చేసింది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారం చేసాయి. అన్ని పేపర్స్ ప్రచురితం చేసాయి. దీంతో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..' అంటూ కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు.
Also Read : హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. పరారీలో మరో యూట్యూబర్
నాగార్జున హాజరైన నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద మీడియా హడావిడి నెలకొంది. ఈ సమయంలోనే ఓ జర్నలిస్ట్ కొండా సురేఖ లాయర్ తో మాట్లాడారు. ఓ మహిళపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? అంటూ మహిళా లాయర్ ను ప్రశ్నించగా విచిత్రంగా స్పందించారు.
అందుకే క్షమాపణ చెప్పింది..
అసలు కొండా సురేఖ తప్పుగా ఏం మాట్లాడలేదు. ఏమైనా పడుకోమని అన్నారా? ఇంకేమైనా అసభ్యకరంగా మాట్లాడారా? అంటూ సమంత గురించి మంత్రి సురేఖ మాటల్లో తప్పేమి లేదన్నారు లాయర్. సమంత పేరు వాడినందుకే కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. అంతేకాదు తప్పు చేసినందుకు కాదని లాయర్ అన్నారు.
సినిమా రంగం గురించి అందరికీ తెలుసు? హీరోలు, హీరోయిన్లు ఎలా వుంటారో తెలియంది కాదన్నారు. కానీ సినిమా వాళ్లంతా కలిసి స్టేట్ మెంట్లు ఇవ్వడమేంటో అర్థం కావడంలేదు అంటూ" సురేఖ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి.