యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అతి తక్కువ సమంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో ఈ అందాల ముదుగుమ్మ ఒకరు.
మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు సినిమాలతో అభిమానుల్ని ఆకట్టుకుంది. నేడు ఈ బ్యూటీ బర్త్ డే కావడంతో ఆమె ఆస్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.
కీర్తి సురేష్ మరెవరో కాదు.. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనకా దంపతుల ముద్దుల కుమార్తె. బాలనటిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2013లో మలయాళంలో గీతాంజలి మూవీ ద్వారా హీరోయిన్గా పరిచయం అయింది.
కాగా ఈ బ్యూటీ 2021లో ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో స్థానం పొందింది. తాజా నివేదికల ప్రకారం.. కీర్తి సురేష్ ఆస్తులు దాదాపు రూ.41 కోట్లు అని తెలుస్తోంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఏడాదికి రూ.35 లక్షల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇదంతా ఒక్క సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్ డీల్స్, సోషల్ మీడియా పోస్ట్స్, ప్రకటనలు సహా మరిన్నింటి వాటితో సంపాదిస్తుంది. కాగా ఒక్కో సినిమాకు సుమారు 4 కోట్లు రెమ్యూనరేషన్, ఎండార్స్ మెంట్ కి రూ.30 లక్షల వరకు వసూళు చేసిందని సమాచారం.
ఆమెకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ అపార్ట్మెంట్ కూడా ఉంది. ప్రస్తుతం కీర్తి తన తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో నివసిస్తుంది.