/rtv/media/media_files/2025/12/24/kayadu-lohar-2025-12-24-07-18-03.jpg)
Kayadu Lohar
Kayadu Lohar: డ్రాగన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి కాయదు లోహర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. తాజాగా ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌లో నటించేందుకు అధికారికంగా ఒప్పుకుంది.
నాని హీరోగా నటిస్తున్న కొత్త తెలుగు సినిమా 'ది ప్యారడైజ్'(Nani The Paradise) లో కాయదు లోహర్ కీలక పాత్రలో కనిపించనుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటుందనే వార్తలు వినిపించాయి. అయితే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పుడు ఆ వార్తలను కాయదు స్వయంగా కన్ఫార్మ్ చేసింది.
Also Read: నీతులు నీ ఇంట్లో వాళ్లకు చెప్పుకో.. ఆర్జీవీ మళ్లీ గెలికేసాడు..!
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/24/kayadu-lohar-2025-12-24-07-19-04.jpg)
ది ప్యారడైజ్ గ్లింప్స్ విడుదలైనప్పుడు థియేటర్లలో వచ్చిన రియాక్షన్ ను చూపిస్తూ కాయదు ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. అదే వీడియోతో ఆమె ఈ సినిమాలో భాగమని అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం ఆమె షూటింగ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం.
ది ప్యారడైజ్ సినిమా నానికి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read: నా బాడీ.. నా ఇష్టం..! మంగపతి పై రెచ్చిపోయిన రంగమ్మత్త
ఈ సినిమా మాత్రమే కాకుండా, కాయదు లోహర్ మరో పెద్ద చిత్రంలో కూడా నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'ఐం గేమ్' సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. దీనితో పాటు ఆమె చేతిలో ఇంకా కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇన్ని మంచి అవకాశాలు రావడంతో కాయదు కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. వచ్చే ఏడాది విడుదలయ్యే సినిమాలతో 2026 సంవత్సరం ఆమెకు చాలా ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. తెలుగు, ఇతర భాషల్లో కూడా ఆమెకు మంచి పేరు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Follow Us