Anasuya: హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై సీనియర్ నటుడు శివాజీ(Actor Shivaji Controversy) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. కొందరు ఆయన మాటలను సమర్థిస్తుంటే, మరికొందరు ఆయన మాట్లాడిన తీరు, వాడిన పదాలు సరైనవి కావని విమర్శిస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటికే గాయని చిన్మయి గట్టిగా స్పందించగా, ఇప్పుడు యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారు.
అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్‌లో “ఇది నా శరీరం… మీది కాదు” అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ శివాజీ చేసిన డ్రెస్సింగ్ కామెంట్స్‌ను ఉద్దేశించిందే అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. కొందరు అనసూయకు మద్దతు ఇస్తుంటే, ఇంకొందరు మాత్రం ఆమెను ప్రశ్నిస్తూ స్పందిస్తున్నారు.
ఒక నెటిజన్ “శివాజీ గారు చెప్పింది కరెక్టే, మీరు డైరెక్ట్‌గా చెప్పాలి” అని కామెంట్ చేయగా, మరో నెటిజన్ “మన సమాజంలో ఇలాంటి ఆలోచనలు ఉంటే మనం మళ్లీ వెనక్కి వెళ్లినట్టే” అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలా ఈ అంశం సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చర్చకు దారి తీసింది.
ఇదే అంశంపై అంతకుముందే గాయని చిన్మయి కూడా తీవ్రంగా స్పందించారు. శివాజీ మహిళల గురించి మాట్లాడేటప్పుడు అసభ్య పదాలు వాడటం తప్పని అన్నారు. మహిళలు ఎలా దుస్తులు వేసుకోవాలన్నది వాళ్ల ఇష్టమని, పురుషులు మాత్రం ఇలా తీర్పులు చెప్పడం సరైంది కాదని ఆమె వ్యాఖ్యానించారు. సంప్రదాయం అంటున్నప్పుడు పురుషులు కూడా అదే పాటించాలంటూ చిన్మయి వ్యంగ్యంగా స్పందించారు.
అసలు ఈ వివాదం మొదలైనది దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలతోనే. హీరోయిన్లు గ్లామర్ పేరుతో హద్దులు దాటకూడదని, చీరలు లేదా కవర్ అయ్యే దుస్తుల్లోనే నిజమైన అందం ఉంటుందని ఆయన అన్నారు. ఈ మాటలు కొందరిని బాధించడంతో వివాదం మరింత పెరిగింది.
ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు స్పందించడంతో, ఈ అంశంపై శివాజీ మళ్లీ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Anasuya: నా బాడీ.. నా ఇష్టం..! మంగపతి పై రెచ్చిపోయిన రంగమ్మత్త
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీనిపై యాంకర్ అనసూయ “ఇది నా శరీరం… మీది కాదు” అంటూ ఇండైరెక్ట్‌గా స్పందించారు. చిన్మయి కూడా గట్టిగా విమర్శించారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది.
Anasuya