/rtv/media/media_files/2025/11/07/vicky-2025-11-07-11-32-29.jpg)
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కత్రినా కైఫ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఈ జంట ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. మా సంతోషాల మూట వచ్చేసింది. అపారమైన ప్రేమతో, కృతజ్ఞతతో మా మగ బిడ్డకు స్వాగతం పలుకుతున్నాము అని వెల్లడించారు. ఈ శుభవార్తతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు వారికి అభినందనలు వెల్లువెత్తించారు.
Katrina Kaif and Vicky Kaushal blessed with a baby boy: ‘Our bundle of joy has arrived’https://t.co/5qjiiN3DO9pic.twitter.com/OXYMNP2Hs6
— Hindustan Times (@htTweets) November 7, 2025
నాలుగేళ్ల ప్రేమ ప్రయాణం
నటి నిమ్రత్ కౌర్, మనీష్ పాల్, హుమా ఖురేషీ వంటి పలువురు సినీ తారలు ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. కత్రినా, విక్కీ 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. ఈ జంట 2025 సెప్టెంబర్ 23సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కత్రినా గర్భవతి అయినట్లు ప్రకటించారు. దాదాపు నాలుగేళ్ల ప్రేమ ప్రయాణం, మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ స్టార్ జంట తమ మొదటి సంతానాన్ని స్వాగతించారు.
Follow Us