Karthik Subbaraj: ఇక ఆపేస్తున్నా..! 'రెట్రో' డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్..

దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు, సూర్య హీరోగా తెరకెక్కించిన తన తాజా సినిమా ‘రెట్రో’పై వచ్చిన విమర్శల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎలాంటి సినిమా రివ్యూలు చదవకూడదని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

New Update

Karthik Subbaraj: కోలీవుడ్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తన తాజా సినిమా ‘రెట్రో’పై( Retro Movie) వచ్చిన విమర్శల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్య(Surya)హీరోగా నటించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వస్తోంది.

Also Read: HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!

అయితే కార్తిక్ సుబ్బరాజు ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ..  ఇకపై ఎలాంటి సినిమా రివ్యూలు చదవకూడదని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపారు. “రివ్యూలు రాయొద్దని నేను చెప్పడం లేదు. కానీ కొన్ని రివ్యూలు చూసినప్పుడు అవి నిజంగా మా సినిమా గురించే రాస్తున్నారా లేక ఇతర ఉద్దేశాలతో రాశారా అనేది సినిమాని తెరకెక్కించిన నాకు అర్థమవుతుంది” అని అన్నారు. ‘రెట్రో’పై వచ్చిన రివ్యూలలో నిజాయతి లేదన్న అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. అందుకే ఇకపై రివ్యూలను పూర్తిగా దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

రజినీకాంత్ తో ‘రెట్రో’..

ఈ సినిమాను మొదట రజనీకాంత్‌ తో తీయాలని కార్తిక్ సుబ్బరాజు అనుకున్నాడట స్క్రిప్ట్ ని కూడా రజినీకాంత్ ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్నారట. “అందులో యాక్షన్, మాస్ అంశాలు ఎక్కువగా పెట్టాలనుకున్నా కానీ కథకి ఓ మలుపు అవసరం రావడంతో ప్రేమకథ ప్రాధాన్యతగా మారిపోయింది. అప్పుడు నాకు సూర్య అయితే ఈ పాత్రకు బాగా సరిపోతారని అనిపించింది,” అని తెలిపారు. ఆసక్తికరంగా, సూర్యకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇది రజనీకాంత్ కోసం రాసిన కథ అని ఆయన గెస్ చేశారన్న విషయాన్నీ కార్తీ పంచుకున్నారు.

తమిళనాడులో ఈ సినిమా ఓ మోస్తరు విజయమైనప్పటికీ, ఇతర భాషల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా సరే విమర్శలకు బదులుగా, తన పని మీద నమ్మకంతో ముందుకు సాగాలని కార్తిక్ నిర్ణయించుకున్నారు.

Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

Advertisment
Advertisment
తాజా కథనాలు