రిషబ్ శెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ "కాంతార: చాప్టర్ 1". భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి కూడా స్వయంగా దర్శకత్వం చేస్తూ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. Also Read: చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి ఆ పోస్టర్‌లో రిషబ్ శెట్టి రగ్గడ్ లుక్ ఊర మాస్‌లో ఉంది. దీంతో ఈ మూవీ మరింత భారీ రెస్పాన్స్‌తో అదరగొట్టేస్తుందని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్‌ల కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. Also Read: మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే.. మినీ బస్సు బోల్తా ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ బ్యాడ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. ఈ మూవీలో నటిస్తున్న నటీనటులు ఘోర ప్రమాదానికి గురయ్యారు. వీరిని తీసుకు వెళ్తున్న ఒక మినీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 20 మంది నటీ నటులు ఉన్నారు. వారిలో 6గురు జూనియర్ నటులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కర్ణాటక జడకల్‌లోని ముదుర్‌లో "కాంతార: చాప్టర్ 1" షూటింగ్ జరిగింది. అది పూర్తయిన తర్వాత మినీ బస్సులో కొల్లూరుకు తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని తట్కా జడ్కల్, కుందాపూర్ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీనిపై కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో రిలీజ్ అయిన "కాంతార" ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక చిన్న సినిమాగా వచ్చిన కాంతార బాక్సాఫీసును షేక్ చేసింది. కని విని ఎరుగని రీతిలో అదరగొట్టేసింది. ఎన్నో బడా సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో.