Kantara Chapter 1: రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ డ్రామా 'కాంతారా: చాప్టర్1' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి వారాంతంలోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం.. 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.
దీంతో కాంతారా ఇప్పటివరకు 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో విక్కీ కౌశల్ 'చావా' సినిమా ఉంది. ఇది జోరు కొనసాగిస్తే మరో వారంలో రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు. కన్నడ, హిందీ వెర్షన్ల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం హిందీ నుంచి ఈ చిత్రం రూ. 80- 90 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాయి. అంచనాలకు తగ్గట్లే మేకర్స్ ని లాభాల బాటలోకి నెట్టింది.
The divine cinematic storm continues to soar higher at the box office 🔥💥#KantaraChapter1 crosses 509.25 CRORES+ GBOC worldwide in the 1st week! #BlockbusterKantara running successfully in cinemas near you. ❤️🔥#KantaraInCinemasNow#DivineBlockbusterKantara… pic.twitter.com/jxYuPN47jL
— Hombale Films (@hombalefilms) October 10, 2025
సూపర్ హిట్ రెస్పాన్స్
భూతకోల సాంప్రదాయం ఇతివృత్తంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో రిషబ్ శెట్టి పాత్ర, నటన ఎంతగానో మెప్పించాయి. గతంలో వచ్చిన కాంతారా పార్ట్ 1 ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో .. ఇప్పుడు దాని ప్రీక్వెల్ 'కాంతారా చాప్టర్ 1' కూడా అదే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. డైరెక్టర్ గా, హీరోగా మరోసారి రిషబ్ శెట్టి తన సత్తాచాటారు. ఇండియాలో మాత్రమే కాదు ఓవర్ సీస్ లోని తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ రుక్మిణి వసంత్ మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె నటన, క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయాయి అని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాలో ఆమె కాస్ట్యూమ్స్ , గ్లామర్ ఫిదా చేశాయి.
Also Read: Upendra Re- Release: 26 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి 'ఉపేంద్ర' కల్ట్ క్లాసిక్.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..?