టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్ సీన్లతో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ఈ సాంగ్‌కు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని దర్శకుడు ముఖేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అన్ని ఎలిమెంట్లను చాలా జాగ్రత్తగా తీస్తున్నాడు. ముఖ్యంగా గ్రాఫిక్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ నటిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ సహా మరెందరో స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
అలాగే ఈ చిత్రంలో మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మూడు తరాలు వారు కనిపించబోతున్నారు. మోహన్ బాబు, మంచు విష్ణు, అతడి కుమారుడు, మోహన్ బాబు మనవడు అవ్రామ్ నటిస్తున్నారు. ఇక భారీ హైప్‌తో రాబోతున్న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 25, 2025న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.