Kannappa Making Video: కన్నప్ప మేకింగ్ వీడియో విడుదల.. మైండ్ బ్లాక్ చేస్తున్న మంచు వారి పర్ఫార్మెన్స్!

'కన్నప్ప' విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్స్ భాగంగా మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో మంచు విష్ణు స్టెంట్స్, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. శివుడి గెటప్ లో ప్రభాస్ సీన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి.

New Update

Kannappa Making Video: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న  మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  'కన్నప్ప' ఈనెల 27న థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం  'కన్నప్ప మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది.  ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.  భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను  నిర్మిస్తున్నారని ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్తమవుతోంది. ఇందులో కనిపించిన భారీ సెట్‌లను, అంతర్జాతీయ సాంకేతిక బృందాలు సినిమా వెనుక ఉన్న కఠినమైన కృషిని చూపిస్తున్నాయి. దట్టమైన అడవులు, అద్భుతమైన దేవాలయాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాగే మంచు విష్ణు యాక్షన్ మేకింగ్ విజువల్స్ హైలైట్ గా కనిపించాయి.

ఆకట్టుకుంటున్న స్టార్ కాస్ట్ 

మేకింగ్ వీడియోలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ కుమార్, కాజల్,  శివ రాజ్‌కుమార్, మోహన్ బాబు  వంటి స్టార్ కాస్ట్  పాత్రలు, వారి ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ 'కన్నప్ప' కు ప్రధాన  ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.

మంచు విష్ణు కొత్త స్ట్రాటజీ.. 

అయితే సాధారణంగా సినిమా విడుదలైన తర్వాత మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తారు. కానీ మంచు విష్ణు వ్యహాత్మkaకంగా రిలీజ్ కి ముందు మేకింగ్ వీడియో బయటపెట్టారు. దీనివల్ల సినిమాకు హైప్ పెరిగే అవకాశం లేకపోలేదు. గతంలో అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమాకు కూడా మేకింగ్ వీడియోను విడుదలకు ముందుగానే రిలీజ్ చేశారు.  శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా మంచు విష్ణు ఈ కథను తెరకెక్కించారు. 

Also Read: Viral News: పదిహేనేళ్ల సంసారంలో ఊహించని ట్విస్ట్ ! చంపుతుందనే భయంతో లవర్ తో భార్యకు పెళ్లి!

Advertisment
తాజా కథనాలు