కన్నప్ప పస్ట్ సాంగ్ సూపర్.. నెటిజెన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. 'X'లో పోస్టులు వైరల్!

'కన్నప్ప' నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ శివయ్య పాటతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ పాటను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. విడుదలైన 24 గంటల్లోనే 2 మిలియన్ పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

New Update

Kannappa first single: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న  'కన్నప్ప' సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మొదట్లో ఈ సినిమాకు కాస్త నెగిటివ్ బజ్ క్రియేట్ అయినప్పటికీ.. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్  'శివ శివ శంకర' పాటతో సినిమాకు విపరీతమైన పాజిటివిటీ వస్తోంది. ఈ పాటను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. విడుదలైన 24 గంటల్లోనే 2 మిలియన్ పైగా వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాట రాత్రికి రాత్రే సినిమా హైప్ ని పెంచేసింది అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

సోషల్ మీడియాలో ట్రెండింగ్ 

'కన్నప్ప' సినిమాపై పాజిటివిటీ పెరుగుతోంది. సినిమా కొంచం క్లిక్ అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. రూ. 500 కోట్లు కలెక్ట్ చేయొచ్చు చెప్పలేము అంటూ ఓ నెటిజన్  ట్వీట్ చేశాడు.   

కన్నప్ప ఫస్ట్ సింగిల్ శివయ్య సాంగ్ చాలా బాగుంది అంటూ ఇంకో నెటిజన్ పోస్ట్ చేశాడు. 

'శివశివశంకర' ఒక్క సాంగ్ సినిమాకు ఉన్న  నెగెటివిటీని అంతా తీసేసింది. ఈ పాట సినిమా బజ్ ని పెంచేసింది. సాంగ్ చాలా బాగుంది అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. 

ఈ పాట ఒక సంపూర్ణ బ్యాంగర్.. రాత్రికి రాత్రే సినిమా హైప్‌ని పెంచేసింది అని మరొక నెటిజన్ రాశాడు. 

Also Read: Samantha: ఏదీ స్థిరంగా ఉండదు.. సమంత మరో సంచలన పోస్ట్! దాని గురించేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు