/rtv/media/media_files/2025/03/21/sfCXr87ZiH1DqmIGsMIc.jpg)
Yash Toxic Updates
Yash Toxic Updates: గీతు మోహన్‌దాస్ డైరెక్షన్ లో కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న "టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్" చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ మూవీ కోసం వివిధ దేశాలకు చెందిన యాక్టర్లను, టెక్నిషియన్లను తీసుకుంటున్నారు మూవీ టీమ్. కన్నడతో పాటు ఇంగ్లీష్ కూడా విడుదల చేస్తున్న ఈ మూవీని వెంకట్ కె.నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!
హాలీవుడ్ స్థాయిలో "టాక్సిక్"..
ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీ ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. తాజాగా జె.జె. పెర్రీ ఈ సినిమాకు సంబందించి తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎంతో కష్టపడి యాక్షన్ సీన్స్ తెరకెక్కించమని, ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ భారీ స్థాయిలో ఉంటాయని ఇంతటి గొప్ప సినిమాలో పని చేయడం తనకి ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. అలాగే, అమెరికన్ నటుడు కైల్ పాల్ కూడా ఈ చిత్రంలో నటించారు. ఆయన మాట్లాడుతూ, "ఈ సినిమా అనుభవం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని" అని చెప్పారు.
Also Read: ఇది రియలైజేషన్ అంటే..! తప్పు ఒప్పుకున్న అనన్య నాగళ్ల
ఈ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. "కె.జి.ఎఫ్" వంటి భారీ చిత్రాల తర్వాత యశ్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవిపై హైప్ పెరిగిపోయింది. ఈ సినిమాను పలు భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Also Read: రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్'.. అరాచకం సామి ఇదీ!!
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!