Actor Mukesh: గత కొద్దీ రోజులుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇండస్ట్రీలో సంబంధం లేకుండా అత్యాచారం కేసుల్లో కొందరు నటులు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడు రాజ్ తరుణ్, లావణ్య కేసు మరవక ముందే జానీ మాస్టర్ తన పై అత్యాచారం చేశాడని అతని అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జానీ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను నేరం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే రాజ్ తరుణ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా..
కమ్మూనిస్టు పార్టీ పరిపాలిస్తున్న కేరళ రాష్ట్రంలోని సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ అత్యాచారాల కేసులు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఓ కమిటిని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అన్ని సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఉండాలని నటి సమంత డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
అత్యాచారం కేసులో నటుడు అరెస్ట్..
ఇటీవల నటిపై అత్యాచారం కేసులో కేరళలో నటుడు అరెస్ట్ అయ్యాడు. సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముకేష్ సినిమా అవకాసం నిమిత్తం తనను పలు మార్లు అత్యాచారం చేశాడని ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసును ప్రత్యేక విచారణ బృందానికి (సిట్) అప్పగించారు. దీనిపై విచారణ జరిపిన అతన్ని మంగళవారం అరెస్ట్ చేసింది. కాగా తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ నటుడు ముకేష్ కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. కాగా ఆయనను స్పెషన్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వైద్య పరీక్షల అనంతరం అతన్ని పోలీసులు విడుదల చేశారు.