kamal Hasan: 70 ఏళ్ల వయసులో కమల్ లిప్ లాక్స్ , రొమాన్స్ .. సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్!

'థగ్ లైఫ్' ట్రైలర్ లో కమల్ హాసన్ లిప్ లాక్ సీన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 70 ఏళ్ళ వయసున్న కమల్ తక్కువ వయస్సు ఉన్న హీరోయిన్స్ తో రొమాంటిక్ సన్నివేశాలు చేయడాన్ని విమర్శిస్తున్నారు. “ఇలాంటి సీన్లు అవసరమా?” అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

New Update

kamal hasan kissing scene:  కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ - మణి రత్నం కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'థగ్ లైఫ్' జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేయగా.. ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. సూపర్ హిట్ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. 

70 ఏళ్ళ వయసులో లిప్ లాక్ సీన్.. 

అయితే ఈ ట్రైలర్ లోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 70 ఏళ్ళ వయసున్న కమల్ తక్కువ వయస్సు ఉన్న కథానాయికలతో రొమాంటిక్ సన్నివేశాలు చేయడం కొన్ని వర్గాల్లో విమర్శలకు దారి తీసింది.  త్రిషా కృష్ణన్ తో రొమాంటిక్  దృశ్యాలు, అభిరామితో లిప్‌లాక్ సీన్ చేయడాన్ని తప్పు పడుతున్నారు. కమల్ హాసన్, అభిరామి మధ్య 30 ఏళ్ళ వ్యత్యాసం ఉంది. అదే విధంగా త్రిషతో కూడా. దీంతో “ఇలాంటి సీన్లు అవసరమా?” అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

తప్పేంటి..

అయితే మరికొంతమంది నెటిజన్లు మాత్రం.. అది కేవలం సినిమా పాత్రల మధ్య సన్నివేశం మాత్రమేనని అంటున్నారు. కథకు అనుగుణంగా సన్నివేశాలు ఉంటాయి అని సమర్థిస్తున్నారు. మరో నెటిజన్ ''ట్రైలర్‌ మొత్తంలో  కేవలం ముద్దు సన్నివేశం మాత్రమే మీకు కనిపించిందా? ఇంకేమీ లేదా''?  అంటూ కామెంట్ చేశారు.

 

30 ఏళ్ల తర్వాత మణి రత్నం, కమల్ మళ్ళీ కలిసి వస్తున్నారు. 1987లో వీరిద్దరి కాంబోలో వచ్చిన  'నాయకన్'  ఇప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ గా నిలిచింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తెరపై కమల్, మణి రత్నంమ్యాజిక్ మరోసారి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్,  సాన్యా మల్హోత్రా, అభిరామి, సిలంబరసన్,  ఆశోక్ సెల్వన్,  ఐశ్వర్య లక్ష్మి వంటి తారాగణం కీలక పాత్రల్లో నటించారు. 

telugu-news | latest-news | cinema-news | Thug Life Trailer | kamal-hasan

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు