Kamal Haasan: కత్తి బహూకరించిన అభిమానిపై కమల్‌ ఫైర్.. వీడియో వైరల్

పార్టీ మీటింగ్‌లో ఓ అభిమాని కత్తి బహుకరించడంపై కమల్‌ హాసన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కత్తిని పైకెత్తి చూపించాలంటూ వారు ఒత్తిడి చేయడంతో సహనం కోల్పోయి కింద పెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
kamal haasan viral video

kamal haasan viral video

Kamal Haasan: మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌  ఇటీవలే జరిగిన పార్టీ మీటింగ్ లో అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే మీటింగ్ లో ఓ అభిమాని  అభిమాని కత్తి బహుకరించడంపై కోప్పడ్డారు. దాంతో పాటు కత్తిని పైకెత్తి చూపించాలంటూ  ఒత్తిడి చేయడంతో సహనం కోల్పోయి కింద పెట్టేశారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే కమల్ హాసన్  డీఎంకే కూటమి తరఫున   నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్నికయ్యారు. 

అతి తక్కువ వసూళ్లు

కమల్ హాసన్  సినిమాల విషయాలకు వస్తే..  మణిరత్నం-కమల్ కాంబోలో ఇటీవలే విడుదలైన 'తగ్ లైఫ్' బాక్స్ ఆఫీస్ వద్ద  ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కమల్ కెరీర్ లోనే ఈ సినిమా అతి తక్కువ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ పై కూడా ప్రభావం పడినట్లు తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉండడంతో.. డిజిటల్ పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్  తమ ఒప్పందాన్ని తిరిగి చర్చించాలని అనుకుంటుందట. రిలీజ్ కి ముందు రూ. 130 కోట్లకు డీల్ కుదుర్చుకోగా.. ఇప్పుడు అందులో  20-25% తగ్గించాలని నెట్ ఫ్లిక్స్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. 

మరోవైపు కమల్ కన్నడ భాష వివాదం కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. 'తగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  కన్నడ భాష నుంచి తమిళ్ పుట్టింది అని ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో  దుమారం రేపాయి. కమల్ వ్యాఖ్యలు కన్నడిగులు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయనపై విమర్శలు వెలువెత్తాయి. 

Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు