/rtv/media/media_files/2024/12/05/1u9qgcJbTMvfRQT2QDat.jpg)
ram prasad
జబర్దస్త్ కమెడియన్ గా
జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రామ్ ప్రసాద్ ఒకడు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ కాంబో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ లభించింది. ఇక రామ్ ప్రసాద్ తన ఆటో పంచులు, కామెడీ టైమింగ్ తో ఆటో రామ్ ప్రసాద్ గా మారిపోయాడు. జబర్దస్త్ ఫేమ్ తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా అలరించాడు రామ్ ప్రసాద్. నేను లోకల్, బెదురులంక, ఫ్యామిలీ స్టార్, శాకినీ డాకినీ వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం శ్రీదేవీ డ్రామా కంపెనీ, పలు టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు.