/rtv/media/media_files/2025/10/11/raja-saab-ott-2025-10-11-09-50-56.jpg)
Raja Saab OTT
Raja Saab OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న తాజా చిత్రం "ది రాజా సాబ్" పై రోజురోజుకీ ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. థియేటర్లలో ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
Also Read: హాట్ అండ్ క్యూట్ లుక్స్‌లో మెహ్రీన్..
భారీ OTT డీల్! (Raja Saab OTT Deal)
తాజా సమాచారం ప్రకారం, "ది రాజా సాబ్" సినిమాకి సంబంధించిన OTT హక్కుల కోసం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు పోటీ పడుతున్నాయి. ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, నిర్మాతలు భారీ ధరను కోరుతున్నారట.
వారికీ మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ, ఇంకా ఒప్పందం ఖరారు కాలేదు. కానీ ఈ వారం లోపలే డీల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా మీద ఉన్న అంచనాలు, విడుదల తేది (సంక్రాంతి) చూసుకుంటే ఇది 2026లో అత్యంత ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటిగా ఉంది.
Also Read: వైరల్ అవుతోన్న 'OG' హీరోయిన్ ప్రియాంక మోహన్ AI ఫోటోలు..
ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్..
ఈ సినిమాలో మాలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ తో సినిమాకు ఒక ప్రత్యేకమైన గ్లామర్ టచ్ రావడం తో పాటు, కథలో కొత్తదనమూ కనిపించబోతుందని చిత్రబృందం చెబుతోంది.
ఇప్పటివరకు యాక్షన్, మాస్ కమర్షియల్ సినిమాల్లో ప్రభాస్ చేసినా, ఇది ఆయన మొదటి పూర్తిస్థాయి హారర్ ఎంటర్‌టైనర్ కావడం విశేషం. ఇందులో భయం, కామెడీ, ఎమోషన్ అన్నింటినీ మిక్స్ చేసి వినోదం అందించనున్నట్టు సమాచారం. దర్శకుడు మారుతి తన స్టైల్‌లో సినిమా తెరకెక్కిస్తున్నారని, ఇది ప్రభాస్ అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీ కన్‌ఫర్మ్.. పూజా కార్యక్రమం త్వరలో!
భారీ విజువల్స్..
సినిమాకు ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే తమన్ బీజీఎం గురించి బజ్ మొదలైంది. అలాగే, సినిమాటోగ్రఫీ బాధ్యతలు కార్తీక్ పల్ని చేపట్టారు. విజువల్ ప్రెజెంటేషన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద బలంగా నిలుస్తాయని చెబుతున్నారు.
Also Read: కెరీర్ మీద ఫోకస్ పెట్టిన పికిల్స్ పాప.. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ?
ఇప్పటికే భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న "ది రాజా సాబ్" సినిమా, సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతుండగా, OTT హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యే లాగా ఉన్నాయన్న వార్తలు మరింత హైప్ తీసుకువస్తున్నాయి. థియేటర్లలో ప్రభాస్‌ను కొత్తగా చూడాలనుకునే అభిమానులకు ఈ చిత్రం పక్కా వినోదాన్ని అందించనుంది.