Housefull 5: అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశముఖ్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్ టైనర్ 'హౌస్ ఫుల్ 5' ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది ఫుల్ టైం స్ట్రీమింగ్ మోడ్ లో అందుబాటులోకి రాలేదు. రెంటల్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా చూడలంటే రూ. 349 చెల్లించాల్సి ఉంటుంది. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో గత నెల 6న విడుదలైన ఈ చిత్రం పలు వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
As we've SAID🔥✅💯 #Housefull5 is Now Available On Prime Video in RENT Model💥🏠#AkshayKumar | #JacquelineFernandez | #AbhishekBachchan | #NargisFakhri | #SoundaryaSharma | #SanjayDutt | #NanaPatekar 😎👍⭐ #Housefull5OnPrime#Housefull5A#Housefull5Bhttps://t.co/tjCyeIPj7lpic.twitter.com/lK8MGehhmt
— OTT STREAM UPDATES (@newottupdates) July 17, 2025
కథేంటి..?
క్రూజ్ షిప్ పార్టీకి వెళ్లిన ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. జాలీగా సాగుతున్న ఈ ముగ్గురి జీవితంలో అనుకోని హత్యా నేరం ఎలాంటి మార్పులకు దారితీసింది అనేది హౌస్ ఫుల్ 5 కథ. ఇందులో నర్గీస్ ఫక్రీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చుంకీ పాండే, జానీ లివర్, శ్రేయాస్ షర్నో మోరేనా, శ్రేయాస్ షర్నో మోరెనార్, రాంకీ తల్పాడే, ధీర్, జానీ లీవర్, ఆకాష్‌దీప్ సబీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు బాలీవుడ్ నాలుగు భాగాలుగా రూపొందిన మొదటి ఫ్రాంచైజీ హౌస్ ఫుల్. గతంలో విడుదలైన 1,2,3,4 సీరీస్ లు కూడా సూపర్ హిట్ విజయాన్ని సాధించాయి.
Also Read:Badshah: ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు