Homebound: టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జాన్వీ కపూర్  'హోమ్‌బౌండ్'

ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ కలిసి నటించిన  'హోమ్‌బౌండ్' ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్  2025లో ప్రదర్శితం కానుంది. ఈ వార్త అభిమానులను, చిత్రబృందాన్ని ఆనందంలో ముంచెత్తింది.

New Update

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సినీ ఉత్సవాలలో ఒకటి. ఇక్కడ సినిమా ప్రదర్శితం కావడం అంటే దానికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్టే. 'హోమ్‌బౌండ్' TIFFకి ఎంపిక అవ్వడం చిత్ర బృందానికి గొప్ప విజయం.

ఇదిలా ఉంటే ఇటీవలే  78వ కేన్స్  ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా  'హోంబౌండ్'   ప్రీమియర్ అయ్యింది. ఈ ఏడాది భారత్ నుంచి కేన్స్ లో ప్రదర్శితం అవుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.  ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ ప్రపంచ సినిమా ప్రేక్షకులకు తన ప్రతిభను పరిచయం చేసింది.  జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ గతంలో 'ధడక్' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఇది వారిద్దరూ కలిసి చేస్తున్న రెండవ చిత్రం 'హోంబౌండ్'. 

Also Read:Allu Arjun: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా

Advertisment
Advertisment
తాజా కథనాలు