Michael Madsen: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో స్టార్ హీరో మృతి!

ప్రముఖ హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ 67 ఏళ్ళ వయసులో మృతిచెందారు. జులై 3న కాలిఫోర్నియా మాలిబులోని తన నివాసంలో స్పృహ కోల్పోయి కనిపించారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Michael Madsen passed away

Michael Madsen passed away

Michael Madsen:  'కిల్ బిల్', 'రిజర్వాయర్ డాగ్స్'  వంటి సూపర్ హిట్  చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ ప్రముఖ  నటుడు  మైఖేల్ మాడ్సెన్ 67 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. పలు నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం కాలిఫోర్నియాలోని మాలిబులో ఉన్న ఆయన  నివాసంలో  మాడ్సెన్ స్పృహ లేకుండా పడిపోయి కనిపించారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మేనేజర్ రాన్ స్మిత్, గుండెపోటుతోనే మాడ్సెన్ మరణించినట్లు చెప్పారు.

300కు పైగా సినిమాలు

1980లో కెరీర్ మొదలు పెట్టిన  మైఖేల్ మాడ్సెన్ 300కు పైగా సినిమాలు, టీవీ షోలలో నటించారు. ఇండిపెండెంట్ సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలలో కూడా ఆయన తనదైన నటనను కనబరిచారు. ముఖ్యంగా, 'రిజర్వాయర్ డాగ్స్' సినిమాలో 'మిస్టర్ బ్లోండ్' పాత్రలో ఆయన చేసిన ప్రదర్శన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.  'కిల్ బిల్: వాల్యూమ్ 1 & 2', 'ది హేట్‌ఫుల్ ఎయిట్' వంటి సినిమాల్లో కూడా ఆయన నటనతో మెప్పించారు.  ఇదిలా ఉంటే  2022లో మాడ్సెన్ కుమారుడు హడ్సన్ మాడ్సెన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన తీవ్ర  డిప్రెషన్ కి గురైనట్లు సమాచారం. ఈ సమయంలోనే  ఆయన భార్య డియాన్నా మాడ్సెన్ నుంచి విడిపోవడం కూడా జరిగింది. 2024లో, మాలిబులో తన భార్యపై దాడి చేసిన ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు, అయితే ఆ కేసు తరువాత కొట్టివేయబడింది.

మైఖేల్ మాడ్సెన్ మరణం హాలీవుడ్‌కు తీరని లోటుగా మిగిలింది. ప్రముఖులు, సినీ తారలు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. మ్యాడిసన్  తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. అనుష్క శెట్టి  'నిశ్శబ్దం' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు.  

Also Read: Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్‌లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో

Advertisment
Advertisment
తాజా కథనాలు