Poonam Kaur : త్రివిక్రమ్‌పై ఇంకెప్పుడు చర్యలు..  పూనమ్‌ సంచలన ట్వీట్‌

త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరోసారి విమర్శలు గుప్పించింది పూనమ్. గతంలో తాను మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని.. ఇప్పటిరవరకు దానిపై ఎలాంటి స్పందన లేదంటూ ప్రశ్నించింది. తన ఫిర్యాదు మేరకు త్రివిక్రమ్‌ను ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం జరగలేదంటూ నిలదీసింది.

New Update
Trivikram and poonam kaur

Trivikram and poonam kaur Photograph: (Trivikram and poonam kaur)

ఎప్పుడు వివాదాస్పద ట్వీట్లతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది హీరోయిన్ పూనమ్ కౌర్.  తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరోసారి విమర్శలు గుప్పించింది.  గతంలో డైరెక్టర్ త్రివిక్రమ్ పై  తాను మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)లో ఫిర్యాదు చేశానని..  ఇప్పటిరవరకు దానిపై ఎలాంటి స్పందన లేదంటూ పూనమ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.  తన ఫిర్యాదు మేరకు త్రివిక్రమ్‌ను ఎందుకు  ప్రశ్నించడం లేదా అతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం జరగలేదంటూ నిలదీసింది. సినీ ఇండస్ట్రీలో తన జీవితాన్ని  నాశనం చేసి, ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ పూనమ్ తన ట్వీట్ లో వెల్లడించింది. పూనమ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.  

గురూజీ అంటూ ఇన్ డైరెక్ట్ గా 

త్రివిక్రమ్ పై పూనమ్ ఇలాంటి ట్వీట్లు చేయడం ఏమీ మొదటిసారి కాదు గతంలోనూ తీవ్రస్థాయిలో పూనమ్ ఈ స్టార్ డైరెక్టర్ పై కీలక ఆరోపణలు చేసింది.  మొదట్లో గురూజీ అంటూ ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసిన పూనమ్ ఇప్పుడు డైరెక్ట్ గా పేరుతోనే ట్వీట్లు చేస్తుంది. ఇంతకీ త్రివిక్రమ్  ఆమెకి  చేసిన అన్యాయం ఏంటీ అనేది మాత్రం ఇప్పటివరకు పూనమ్ బయటపెట్టలేదు. దీనిపై నెటిజన్లు ఎన్ని సార్లు క్వశ్చన్ చేసిన పూనమ్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు.   

పంజాబీ భామ అయిన పూనమ్..  హైదరాబాద్ లో పుట్టి పెరిగింది.  2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్..   ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ మొదలైన చిత్రాలలో నటించింది. అయితే  సినిమాల్లో హీరోయిన్ గా కంటే వివాదాస్పద ట్వీట్లతోనే పూనమ్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.   

Also Read :  సంక్రాంతి సినిమాల టికెట్ రేట్లు పెరిగాయ్.. ఏ సినిమాకి ఎంత పెంచారంటే?

Advertisment
తాజా కథనాలు