Thangalaan
Thangalaan : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ (Chiyan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో విక్రమ్ లుక్, ఆయన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కథ, కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించిన ‘తంగలాన్’ సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ తరువాత ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
Also Read : సెన్సార్ పూర్తి చేసుకున్న 'తంగలాన్'.. విక్రమ్ సినిమాకు జీరో కట్స్, రన్ టైమ్ ఎంతంటే?
‘తంగలాన్’ ఓటీటీ రిలీజ్
పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’ (Thangalaan) సెప్టెంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, కన్నడ ఒరిజినల్ వెర్షన్ తో రిలీజైన ఈ మూవీ ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగు, కన్నడ, హిందీ సహా ఐదు భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం సుమారు రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. విక్రమ్ కెరీర్ లో ఎప్పుడూ చేయని భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ గా నటించగా.. డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి, హరి కృష్ణన్ అన్బుదురై వంటి స్టార్ తారాగణం కీలక పాత్రలు పోషించారు. 19వ శతాబ్దంలో కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల నేపథ్య కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పాన్ ఇండియా ప్రాజెక్టు గా రూపొందిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ & నీలం ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కె.ఇ. జ్ఞానవేల్రాజా నిర్మించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
#Thangalaan Ott Relese - Sep 20 On Netflix
— Cinema Updates (@PtcSanthos4297) September 11, 2024
Tamil - Telugu - Kannada - Malayalam pic.twitter.com/kbIHBFEgyO
Also Read : విక్రమ్ 'తంగలాన్' కు లైన్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే..?