/rtv/media/media_files/2025/03/16/Embg5N0ruFZy58b1u4Wz.jpg)
Sree Vishnu Item Movie
Sree Vishnu Item Movie: రీసెంట్ గా 'శ్వాగ్'(Swag Movie) మూవీతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు తన తదుపరి సినిమాలను సూపర్ ఫాస్ట్ గా లైన్ లో పెడుతున్నాడు. శ్రీవిష్ణు ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిలో రెండు ప్రాజెక్టులు సెట్‌లపై షూటింగ్ జరుగుతున్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ లో కార్తిక్ దర్శకత్వం లో 'సింగల్' అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు, మరో ప్రాజెక్ట్ ‘మృత్యుంజయ్’ అనే థ్రిల్లర్ సినిమాను డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ తో చేస్తున్నాడు.
Also Read: BIG BREAKING: ఏఆర్ రెహమాన్ కు హార్ట్ ఎటాక్
‘ఐటెమ్’గా శ్రీవిష్ణు...
ఈ రెండు చిత్రాలతో పాటుగా స్వాతిముత్యం ఫేమ్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమా కోసం "ఐటమ్" అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది. స్వాతిముత్యం మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది అని డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ తెలిపారు. స్వాతిముత్యం థియేటర్లలో పెద్ద హిట్ కాకపోయినప్పటికీ, ఓటీటీలో మాత్రం డీసెంట్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
అదే తరహాలో ఇప్పుడు ఈ 'ఐటమ్' మూవీ ఉండబోతుందట. అయితే, ఈ సినిమాను సితార నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!