Globetrotter: రాజమౌళి ‘గ్లోబ్‌ట్రాటర్’లో ఆ సీనియర్ హీరో..? ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా!

మహేష్ బాబు, రాజమౌళి "SSMB29" నుండి పృథ్విరాజ్ లుపై హీరో మాధవన్ కామెంట్ చేయడంతో ఆయన కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లాంచ్ శనివారం రామోజి ఫిల్మ్ సిటీలో ఘనంగా జరగనుంది.

New Update
Globetrotter

Globetrotter

Globetrotter: మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో  రూపొందుతున్న భారీ సినిమా SSMB29 ఇప్పుడు సోషల్ మీడియా వార్తల్లో హాట్ టాపిక్ అయింది. ఈ శనివారం హైదరాబాదులోని రామోజి ఫిల్మ్ సిటీ లో టైటిల్ లాంచ్ కార్యక్రమం జరుగనున్న సంగతి తెలిసిందే.

తాజాగా నిర్మాతలు హీరోయిన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో చీర లుక్ లో కనిపించి శత్రువును లక్ష్యం చేసి బుల్లెట్లు ఫైరింగ్ చేస్తున్న ఫ్రేమ్ లో కనిపిస్తోంది. ఈ లుక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. 

Madhavan in SSMB29 Globetrotter 

అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది, అదే ఆరె. మాధవన్ రియాక్షన్. సాధారణంగా కో-స్టార్ లుక్ పై కామెంట్లు పెట్టడం సామాన్యమే, కానీ మాధవన్ పృథ్వి రాజ్ సుకుమరణ్ పోస్టర్ పై రియాక్ట్ అవ్వడం విశేషం. దీనిని చూసి ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. అందరు నమ్ముతున్నది ఏంటంటే, అతను ఈ సినిమాలో భాగమవుతాడని. ఇప్పటికే కొన్ని రూమర్లు వచ్చాయి, మాధవన్ మహేష్ బాబుకు తండ్రి పాత్రలో కనిపించవచ్చు అని.

ప్రస్తుతం అతని సోషల్ మీడియా యాక్టివిటీ చూస్తే, SSMB29 తో ఆయన సంబంధం ఉండే అవకాశం ఎక్కువే అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే, అధికారిక సమాచారం కోసం కొన్ని రోజులు అగ్గాల్సిందే. 

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిర్మాతలు శ్రీ దుర్గ ఆర్ట్స్‌ KL నారాయణ. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడించనున్నారు.

ప్రియాంక చోప్రా లుక్ పై రాజమౌళి తన ట్విట్టర్/X అకౌంట్ ద్వారా ఇలా పేర్కొన్నారు: "The woman who made Indian cinema an international gem. Welcome, Desi girl! The world is now going to see your Mandakini." అయితే ఈ పోస్టర్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యింది.

అయితే హీరో మాధవన్ఈ సినిమాలో ఉన్నారా? లేదా? ఒకవేళ ఉంటే ఆయన పాత్ర గురించి అధికారిక వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Advertisment
తాజా కథనాలు