HariHara VeeraMallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాలుగేళ్ళ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. నాలుగేళ్ళ పాటు సెట్స్ పై ఉన్న 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు థియేటర్స్ లో విడుదలైంది. నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొందరు అభిమానులు సినిమా సూపర్ అంటుండగా.. మరికొందరు మాత్రం ఓవరాల్ గా నిరాశపరిచిందని కొన్ని సీన్స్ , ఫస్ట్ ఆఫ్ మాత్రమే సినిమాకు హైలైట్ అని చెబుతున్నారు. సెకండ్ ఆఫ్ లో సీన్స్ చాలా ల్యాగ్ చేశారని, కథ, కథనం ఆశించిన స్థాయిలో లేవని అంటున్నారు. అయితే సెకండ్ ఆఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణం డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమే అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
క్రిష్ చేసుంటే బాగుండేది!
అయితే 'హరిహర వీరమల్లు' సబ్జెక్ట్ ని ఇద్దరు డైరెక్టర్లు హ్యాండిల్ చేశారు. మొదట డైరెక్టర్ క్రిష్ సగం చిత్రీకరణ పూర్తి చేయగా.. ఆ తర్వాత పలు కారణాల చేత ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ టేకోవర్ చేశారు. అలా ఫస్ట్ హాఫ్ అంతా క్రిష్ డైరెక్ట్ చేశారట. ఆ తర్వాత ప్రాజెక్ట్ చేతులు మారడంతో కథ డిస్ట్రబ్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్. అందుకే సెకండ్ ఆఫ్ ఆశించిన స్థాయిలో లేదని చర్చ జరుగుతోంది. సెకండ్ ఆఫ్ కూడా డైరెక్టర్ క్రిష్ హ్యడిల్ చేసుంటే ఇంకా బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Okayish - Decent
— Hari K 👑 (@brahmi_fan) July 23, 2025
Good first half
2nd half disappointed
Vfx 🙏😭
Bgm by mmk 🔥🔥
Pawan Kalyan solid performance 💥💥
Niddhi bagundi ❤️
Bobby Deol screen Presence 🔥💥
Story 👍 2nd half😴
Krish teyalsindi mottham
Jyothi krishna 🫠
🌟🌟⭐/5#PawanKalyan#HHVM#HariHaraVeeraMallupic.twitter.com/xcwjOKRJqZ
ఫస్ట్ హాఫ్ హైలైట్
పవన్ ఇంట్రో, మచిలీపట్నం పోర్ట్ ఫైట్, చార్మినార్ చేజ్, కుస్తీ ఫైట్, కొల్లగొట్టినాదిరో పాటతో ఫస్ట్ ఆఫ్ అంచనాలకు దీటుగా సాగిందని చెబుతున్నారు. ఆ తర్వాత మొదలైన సెకండ్ ఆఫ్ నెమ్మదిగా సాగుతూ.. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లో ఊపందుకుంటుందని టాక్. 16వ శతాబ్దం మొఘల్ సామరాజ్యం కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ తెరకెక్కిన ఈ సినిమాలో 'వీరమల్లుగా' పవన్ నటన , స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని చెబుతున్నారు. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ సూపర్ హిట్.. సెకండ్ ఆఫ్ ల్యాగ్ అని కొందరి ఫ్యాన్స్ అభిప్రాయం.
Also Read: Hari Hara Veera Mallu Review: పవన్ వన్ మ్యాన్ షో.. 'హరిహర వీరమల్లు' ఫుల్ రివ్యూ !