Hansika నటి హన్సిక ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ హర్రర్ థ్రిల్లర్ 'గార్డియన్'. గతేడాది తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24 అంటే ఈరోజు నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా టీజర్ విడుదల చేసింది. హర్రర్ జోనర్ ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
Telugu version of Tamil film #Guardian (2024) by @gurusaravanan & @sabari_gireesn, ft. @ihansika #SureshChandrMenon @ActorSriman #KrishitaasYaazhin & #Rajendran, now streaming on @ahavideoIN.@SamCSmusic @vijayfilmaker @FilmWorksOffl @shakthi_dop @artilayaraja @thiyaguedit pic.twitter.com/tZmtvEe1hC
— CinemaRare (@CinemaRareIN) April 24, 2025
శబరి, గురుశర్వనన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో సురేష్ మీనన్, సుప్రవా మండల్, శ్రీమన్, మొట్టై రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు.
telugu-news | latest-news | cinema-news