Gymkhana Trailer వైబ్స్, ఫైట్స్, ఫన్.. ప్రేమలు హీరో  'జింఖానా' ట్రైలర్.. భలే ఉంది!

'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ నటించిన లేటెస్ట్ యూత్ ఫుల్ సొర్త్స్ డ్రామా  'జింఖానా'. తాజాగా ఈమూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ 25న తెలుగులో విడుదల కానుంది. 

New Update

'జింఖానా' తెలుగు ట్రైలర్

అయితే సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో తెలుగులో కూడా డబ్ చేసేందుకు ప్లాన్ చేశారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కథ బాక్సింగ్ శిక్షణలో చేరే యువకుల చుట్టూ తిరుగుతుంది. సరదాగా బాక్సింగ్ శిక్షణలో చేరిన వారికి .. ఆ ఆట పట్ల తీవ్రమైన అభిరుచి పెరగడానికి కారణమేంటి? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.  ఫన్నీ డైలాగ్‌లు, యువత వైబ్స్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు ట్రైలర్ లాంచ్ చేశారు.  నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్, కార్తీక్, షోన్ జాయ్, అనఘ రవి, నంద నిశాంత్ , నోయిలా ఫ్రాన్సీ,  షైన్ టామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

telugu-news | latest-news | cinema-news | Gymkhana Telugu Trailer | premalu-movie 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు