Gopichand : విశ్వం ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్ ఖాతాలో హిట్ పడినట్లేనా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్య థాపర్ జంటగా నటించిన విశ్వం సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమాతో గోపీ చంద్‌కి హిట్ పడిందా? లేదా? ట్విట్టర్ రివ్యూ చూసేద్దాం.

FotoJet (16)
New Update

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన విశ్వం సినిమా మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. గోపీచంద్‌ ఖాతాలో కూడా హిట్ పడి చాలా కాలమే అయ్యింది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలు తెలుసుకుందాం. 

కామెడీ టైమింగ్ సూపర్

యాక్షన్ సీన్లలో గోపీచంద్ నటన ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. తనదైన నటనతో యాక్షన్‌ సీన్లలో మెప్పించాడు. ఈ మూవీలో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. అన్ని సినిమాల్లా ఫస్టాఫ్ రొటీన్ అనిపించిన కూడా కామెడీ సూపర్‌గా ఉందట. 

ట్రైన్ సీన్ ఎక్స్టార్డినరీ

ఈ సినిమాలో ట్రైన్ సీన్ బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. గతంలో శ్రీను వైట్ల తీసిన వెంకీ సినిమాలో ట్రైన్ సీన్స్ ఎలా హిట్‌ అయ్యాయో..ఇది అంతకంటే ఎక్స్టార్డినరీగా ఉందట. 

Also Read :  తీవ్ర అనారోగ్యం బారిన పడ్ద పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు

గోపీ చంద్‌కు హిట్టా?

సినిమా బాగుంది.. కానీ కమ్ బ్యాక్ ఇచ్చేంత హిట్ అయితే కాదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో వచ్చిన కామెడీ సీన్లు బాగా పండాయని, కొందరేమో ఫస్టాఫ్ కామెడీ బాగుందని అంటున్నారు.

Also Read :  'విశ్వం' నుంచి మాస్ సాంగ్.. గోపీచంద్, కావ్య థాపర్ డ్యాన్స్ అదుర్స్

క్లైమాక్స్ మైనసా?

రొటీన్ సినిమా అయిన కొన్ని చోట్ల కామెడీతో పర్లేదు అనిపిస్తుంది. కానీ చివరి క్లైమాక్స్ ఇంకా బాగా తీసి ఉంటే బాగుండే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొన్ని సీన్లు సాగదీతగా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. 

Also Read :  అల్లు అర్జున్ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో!

బోయపాటిని తలిపించిన సీన్లు

యాక్షన్ సన్నివేశాలను తీయడంలో దర్శకుడు బోయపాటి టాప్ అని చెప్పవచ్చు. అయితే విశ్వం సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో శ్రీను వైట్ల బోయపాటిని గుర్తు చేశారట. 

Also Read :  నేడు దిగ్గజ నటుడు బిగ్‌బీ అమితాబ్ పుట్టిన రోజు

#tollywood #twitter-review #gopichands-viswam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe