God Crime Thriller: అమ్మాయిల బాడీ పార్ట్స్ కట్ చేసి..! ఓటీటీ లో ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్

జయం రవి, నయనతార క్రైమ్ థ్రిల్లర్ "గాడ్" (తమిళంలో "ఇరైవన్") ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌లో ఉంది. సైకలాజికల్ మిస్టరీ, రక్తపాతం, ట్విస్టులతో నిండి ఉన్న ఈ సినిమా, స్మైలీ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ కథగా ఉత్కంఠ రేపుతుంది.

New Update
God Crime Thriller

God Crime Thriller

God Crime Thriller: తాజాగా ఓటీటీలో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ గాడ్ (GOD) సినిమా ప్రస్తుతం మంచి హైప్‌ తో రన్ అవుతోంది. తమిళంలో “ఇరైవన్” పేరుతో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో గాడ్ అనే పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది. మిస్టరీ, సస్పెన్స్, రక్తపాతం, ఊహించని ట్విస్టులతో ఈ సినిమా థ్రిల్లర్‌ జనర్లో అదరకొడుతోంది.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

కథ ఏంటి?

ఈ సినిమాలో జయం రవి(Jayam Ravi) ఏసీపీ అర్జున్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. అతడు న్యాయం కోసం చట్టాన్ని కూడా ఎదిరించడానికి  సిద్ధంగా ఉన్నవాడిగా చూపిస్తారు. అతడి మిషన్ ఏంటంటే... సిటీని వణికిస్తున్న క్రూరమైన స్మైలీ కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్)ను పట్టుకోవడం. ఈ కిల్లర్ మహిళలను టార్గెట్ చేస్తూ, వాళ్లను చంపి, వారి శరీర భాగాలను తొలగించి, నగ్నంగా బయట పడేస్తాడు.

Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్

అర్జున్‌కి ఈ కేసు చాలా పర్సనల్‌గా మారుతుంది. అతని స్నేహితుడు ఆండ్రూను కలుపుకొని, ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు. కథలో నెమ్మదిగా బయటపడే మిస్టరీతో, ఎమోషనల్ టర్నింగ్ పాయింట్స్‌తో ముందుకు సాగుతుంది. చివరికి అసలు నిజం ఏమిటి? బ్రహ్మ వెనుక మరెవరి కధ ఉంది? అనే విషయాలు ప్రేక్షకులను షాక్‌లో పడేస్తాయి.

ఈ సినిమా ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. మానసిక స్థాయిలో మానవులలో ఉండే చీకటి కోణాన్ని దర్శకుడు ఐ. అహ్మద్ బాగా చూపించగలిగారు. జయం రవి, నయనతార పాత్రలు బాగా డిజైన్ చేసారు. ముఖ్యంగా రాహుల్ బోస్ చేసిన విలన్ రోల్ చాలా బలంగా ఉంటుంది. అతడి పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు.

Also Read: అక్కడ రికార్డు బ్రేక్.. దుమ్ము రేపుతోన్న 'మిరాయ్' కలెక్షన్స్

కథ మధ్యలో వచ్చే ట్విస్టులు, ఊహించలేని మలుపులు ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో ఉంచుతాయి. ఇది మామూలు థ్రిల్లర్ కాదు, కాస్త డార్క్ కాన్సెప్ట్‌తో కూడిన మిస్టరీ డ్రామా అని చెప్పవచ్చు.

ఎక్కడ చూడచ్చు?

ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. GOD అనే పేరుతో తెలుగు ఆడియెన్స్‌కి, Iraivan పేరుతో తమిళ ప్రేక్షకులకు స్ట్రీమింగ్ అందుతోంది. ఈ సినిమా మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్, డార్క్ థ్రిల్లర్స్‌కి ఆసక్తి ఉన్నవారికి కచ్చితంగా నచ్చుతుంది. ప్రతి సీన్‌లోనూ థ్రిల్లింగ్ ఉండటంతో పాటు, కథలోని ఎమోషనల్ డెప్త్‌ కూడా బాగా కనెక్ట్ అవుతుంది.

Advertisment
తాజా కథనాలు