Peddi Movie First Single Promo: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పండగే.. చికిరి అంటూ వచ్చేసిన పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో?

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే చికిరి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ప్రోమోను ఇప్పుడు విడుదల చేయగా.. నవంబర్ 7వ తేదీన ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

New Update

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సంద్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా పెద్దిపై కీలక అప్డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. పెద్ద మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర యూనిట్ డేట్‌ను ఫిక్స్ చేయలేదు. అయితే తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చింది.

ఇది కూడా చూడండి: Shraddha Das: ఓల్డ్ బట్ క్యూట్.. వయొలెట్ కలర్ శారీలో మెరిసిపోతున్న శ్రద్ధా దాస్

ఇది కూడా చూడండి: Baahubali The Eternal War: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేసిన ‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’ టీజర్‌ రిలీజ్‌

ప్రోమోను రిలీజ్ చేయగా..

చికిరి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ప్రోమోను ఇప్పుడు విడుదల చేయగా.. నవంబర్ 7వ తేదీన ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో  రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ ప్రోమోలో కేవలం రామ్ చరణ్ అద్భుతమైన స్టెప్‌తో కనిపించారు. అలాగే మ్యూజిక్ కూడా అదిరిపోయిందని నెటిజన్లు అంటున్నారు. ప్రోమో ఇలా ఉంటే.. ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందా? అని నెటిజన్లు ఎంతో ఆసక్తితతో ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు