ఏపీలో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారట. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో కాకినాడ లేదా రాజ‌మండ్రిలో ఈ ఈవెంట్ ను నిర్వ‌హించ‌నున్నార‌ని ఇన్సైడ్ వర్గాల సమాచారం.ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే.

game changer33
New Update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఎప్పుడో మూడేళ్ళ కింద ఈ సినిమాను స్టార్ట్ చేశారు. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేశారు. రిలీజ్ డేట్ రెండు సార్లు మారింది. ఫైనల్ గా ఈ మూవీ  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. 

పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా..

రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై హైప్ ను మరింత పెంచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్నో లో టీజర్ ను లాంచ్ చేయగా.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రం ఏపీలో నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారట.

Also Read: టాయిలెట్ పై కూర్చొని గంటలు గంటలు గర్ల్ ఫ్రెండ్ తో సొల్లేస్తున్నారా..? జాగ్రత్త

'గేమ్ ఛేంజర్' రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ప్రీ రిలీజ్ కు పవన్ కళ్యాణ్ అయితేనే కరెక్ట్ అని భావించి మేకర్స్ ఆయన్ను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జ‌న‌వ‌రి మొద‌టి వారంలో కాకినాడ లేదా రాజ‌మండ్రిలో నిర్వ‌హించ‌నున్నార‌ని ఇన్సైడ్ వర్గాల సమాచారం.

ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.  సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనుండగా.. కియారా అద్వానీ, అంజలి  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, సముద్ర ఖని, జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

Also Read :  ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

#pawan-kalyan #game-changer-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe