Gaddar Awards: తెలంగాణ ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 12 ఏళ్లకు గద్దర్ పేరిట సినీ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు విడుదలైన సినిమాల నుంచి అవార్డు విజేతలను వెల్లడించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ కొరియోగ్రాఫర్ ఇలా 24 పైగా కేటగిరీల్లో అవార్డులు ఇచ్చారు.
Also Read: Rakul Preeth: కోహ్లీ ఒక్క లైక్ కి 2 మిలియన్ల ఫాలోవర్లు! అవనీత్ కౌర్ వివాదంపై రకుల్ హాట్ కామెంట్స్
బాలయ్యకు అవార్డుల పంట
ఈ అవార్డుల్లో నందమూరి బాలయ్యకు అవార్డుల పంట పండింది. స్పెషల్ జ్యురీ విభాగంలో బాలయ్యకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు వరించింది.అలాగే 2021, 2023 ఉత్తమ చిత్రాల విభాగంలో 'అఖండ' రెండవ ఉత్తమ చిత్రంగా నిలవగా.. భగవంత్ కేసరి మూడవ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. తనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించడంపై బాలయ్య ఆనందం వ్యక్తం. ఈ మేరకు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. ''తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "ఎన్టీఆర్ జాతీయ అవార్డు"ని నాకు ప్రకటించడం.. నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
/rtv/media/media_files/2025/05/30/kJTEr0uOsGvlyEPrqG4K.png)
ఇదిలా ఉంటే ఇటీవలే బాలయ్యను దేశంలోని మూడవ అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ వరించింది. సినీ, రాజకీయ, సామజిక సేవా రంగాల్లో ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది.
NTR National Film Award - Actor - #NandamuriBalakrishna
— Balayya Trends (@NBKTrends) May 30, 2025
2021 Second Best Feature Film - #Akhanda
The perfect timing before the actor and the movie combo of #Akhanda2 🔥#GaddarAwards#GaddarAwards2024 pic.twitter.com/k7tl99x7x3
Also Read : లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!