/rtv/media/media_files/2025/11/13/globetrotte-2025-11-13-07-42-07.jpg)
Globetrotter
Globetrotter: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘గ్లోబ్‌ట్రాటర్’ (SSMB29) చుట్టూ రోజురోజుకూ కొత్త వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా, ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా గురించి అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచలాని కూడా ఈ సినిమాలో భాగమవుతున్నాడా అని!
Youtuber Ashish Chanchlani in Globetrotter
యూట్యూబ్‌లో తన కామెడీ వీడియోలు, సినిమాటిక్ స్కిట్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆశిష్ ఇటీవల హైదరాబాద్‌కి వచ్చాడు. ఇక్కడే ‘గ్లోబ్‌ట్రాటర్’ షూటింగ్ జరుగుతోందని తెలిసిందే. ఆయన షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులు ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి.
ఆశిష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రదేశాల ఫోటోలు, అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాలోని “కట్టప్ప బాహుబలిని చంపిన సీన్” వాల్ ఆర్ట్‌ను షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు వెంటనే “గ్లోబ్‌ట్రాటర్ సెట్ నుంచేనా?” అంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు.
అంతే కాకుండా, ఆయన X (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్ మరింత సందేహాలు రేకెత్తించింది. ఆ ట్వీట్‌లో ఆయన “#JaiBabu” అని రాయడంతో ‘గ్లోబ్‌ట్రాటర్’లో ఆయన నటిస్తున్నాడా అని చేర్చించుకుంటున్నారు. మరో ఫోటోలో “noveMBer is noveMBering too hard” అంటూ క్యాప్షన్ పెట్టడంతో, “MB” అంటే “Mahesh Babu” అని స్పష్టంగా చెప్తున్నాడని నెట్‌జన్లు అనుకుంటున్నారు.
అయితే తాజాగా, ‘గ్లోబ్‌ట్రాటర్’ టీమ్ తాజాగా విడుదల చేసిన ప్రియాంక చోప్రా పోస్టర్ సోషల్ మీడియాలో పెద్ద హంగామా సృష్టించింది. ఎల్లో చీరలో గన్ పట్టుకుని ఫైర్ చేస్తున్న లుక్‌లో ఆమె ‘మందాకిని’ పాత్రలో కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఆమె లుక్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోయిందని ఫ్యాన్స్ తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు లుక్ కోసం కూడా అభిమానులు కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు. నవంబర్ 15న హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో ఆయన లుక్‌ను విడుదల చేసే అవకాశముందని టాక్.
మొత్తానికి, ‘గ్లోబ్‌ట్రాటర్’ గురించి ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం తీసుకువస్తోంది. ఆశిష్ చంచలాని నిజంగా ఈ సినిమాలో భాగమయ్యాడా లేదా అనేది అధికారికంగా ఇంకా చెప్పలేదు. కానీ ఆయన సోషల్ మీడియా హింట్స్ చూసి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే ఉత్సాహంతో ఊగిపోతున్నారు.
Follow Us