Cinema: ఎప్పటిలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు, సీరీస్ లు ఓటీటీ, థియేటర్ ప్రియులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ వారం పెద్ద హీరోల సినిమాలేమి లేకపోవడంతో చిన్న సినిమాలేది హవా! యాక్షన్, థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు ఈ వారం అలరించే సినిమాల పూర్తి లిస్ట్ ఇక్కడ చూసేద్దాం.
Also Read:Cinema: ఛీ ఇదేం రోగం.. నగ్నంగా ఫొటో షూట్ రిలీజ్ చేసిన మేఘా !
థియేటర్ సినిమాలు
జూనియర్
రాజకీయ నాయకుడు, వ్యాపార వేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న 'జూనియర్ ' ఈనెల 18న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా సందడి చేయనుంది. ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన 'వైరల్ వయ్యారి' సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ చేసింది.
కొత్తపల్లిలో ఒకప్పుడు
రానా దగ్గుబాటి సమర్పణలో మనోజ్ చంద్ర, మోనికా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కూడా జులై 18న విడుదల కానుంది. దీంతో మరో రెండు సినిమాలు పోలీస్ వారి హెచ్చరిక, వచ్చినవాడు గౌతమ్ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఓటీటీ సినిమాలు
అమెజాన్ ప్రైమ్
- కుబేరా: జులై 18 నుంచి స్ట్రీమింగ్
జీ5
- భైరవం - జూలై 18 నుంచి స్ట్రీమింగ్
- సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18
- ద భూత్ని - జూలై 18 నుంచి స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్
- వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ - జూలై 18 నుంచి స్ట్రీమింగ్
- అపాకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ - జూలై 14
- ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ సీజన్ 1 - జూలై 14
హాట్‍స్టార్
- స్టార్ ట్రెక్ సీజన్ 3 - జూలై 18
- కోయిటల్, హీరో అండ్ బీస్ట్ - జూలై 15
- స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 - జూలై 18