Mad Square : మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్ టైన్మెంట్..

సంగీత్ శోభన్, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్'. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ గా నిలిచింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్‌' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

author-image
By Archana
New Update
Mad Square

Mad Square

Mad Square : సంగీత్ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ లీడ్ రోల్స్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ 'మ్యాడ్'. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా గతేడాది విడుదలైన ఈ చిత్రం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. కాలేజీ లైఫ్, ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన ఈ మూవీపై విమర్శకులతో పాటు పలువురు స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని కామెడీ, పాటలు మరింత హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read :  మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు!

'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ లుక్

అయితే తాజాగా 'మ్యాడ్' సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ పంచ కట్టులో మాస్ గా కనిపించారు. మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్ టైన్మెంట్ కు సిద్ధంగా ఉండండి అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే మూవీ ఫస్ట్ సింగిల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read :  బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాన్ అత్యాచారం

Also Read :  లెబనాన్‌లో పేలుతున్న వాకీ టాకీలు.. 9మంది మరణం

'మ్యాడ్' ఫస్ట్ పార్ట్ లో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ ఫీమేల్ లీడ్స్ గా నటించారు. నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సంగీత్ శోభన్ ఇటీవలే జరిగిన సైమా అవార్డ్స్ 2024లో 'మ్యాడ్' సినిమాకు బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సైమా అవార్డు గెలుచుకున్నారు.

Also Read :  దీపావళి బంపర్‌ బోనాంజ…ఉచిత గ్యాస్ సిలిండర్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు