'గూఢచారి 2' షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో.. తృటిలో తప్పిన ప్రమాదం బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి ప్రమాదం జరిగింది. 'గూఢచారి 2' మూవీ షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి ప్రమాదవశాత్తూ కుడి దవడ కింది భాగంలో గాయమైంది. ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇమ్రాన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. By Anil Kumar 08 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Emraan Hashmi Injured: అడివి శేష్ హీరోగా 2018 లో వచ్చిన 'గూడచారి' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అడివి శేష్ కి (Adivi Sesh) జోడిగా శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'గూడచారి 2'(G2) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వినయ్ కుమార్ దర్శకుడుగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రమాదానికి గురయ్యాడు. ఇమ్రాన్ హష్మీ ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. Also Read : కొండా సురేఖ క్రిమినల్.. కోర్టులో నాగార్జున సంచలన స్టేట్మెంట్! తృటిలో తప్పిన ప్రమాదం.. షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఇమ్రాన్ హష్మీకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇమ్రాన్‌కు కుడి దవడ కింది భాగంలో గాయమైంది. దీంతో పెద్ద గాటు పడింది. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇమ్రాన్ హష్మీ అభిమానులు అందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. Shocking to know about @emraanhashmi injury on the set of Adivi Sesh’s G2! Wishing him a speedy recovery. Your strength and resilience are inspiring, and we can't wait to see you back in action! Take care! 💪✨ #GetWellSoon #EmraanHashmi #adivisesh pic.twitter.com/5XrCQuj05g — Dimple Hayathi (Parody) (@hayathidimple) October 8, 2024 బాలీవుడ్ లో అగ్ర హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ.. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' మూవీతో విలన్ గా మారాడు. ఆ సినిమాలో తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG' మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో కూడా విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. #actor-adivi-sesh #goodachari-2 #emraan-hashmi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి