Divvala Maduri: బిగ్ బాస్ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు.. అంతా శ్రీనివాసే: దివ్వెల మాధురి సంచలనం

రియాల్టీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో భాగంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. 

New Update
Divvala Maduri

Divvala Maduri

ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం బయటకొచ్చిన ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ హౌస్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. 

duvvada maduri bigg boss 9 remunaration

ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్య్వ్యూ ఇచ్చిన ఆమె తన బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇప్పుడు ఆమె చెసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. అయితే మాధురి ఏం చెప్పింది అనే పూర్తి విషయానికొస్తే.. 

దివ్వెల మాధురి ఈ సీజన్ 9లో బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. కేవలం మూడు వారాల్లోనే తన ఆటతీరు, మాట తీరుతో దుమ్ము దులిపేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి రీసెంట్‌గా ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని ఆమె కుండబద్దలుకొట్టినట్లు తెలిపింది. 

నార్మల్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లకు వారం వారం వారి ఫేమ్‌ను బట్టి భారీ రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మాధురికి కూడా ఎక్కువగానే పారితోషికం అందినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమెకు మూడు వారాలకు గానూ దాదాపు రూ.9 లక్షల రెమ్యూనరేషన్ అందినట్లు వార్తలు జోరుగా సాగాయి. అయితే ఇప్పుడు దీనిపై మాధురి క్లారిటీ ఇచ్చింది. 

‘‘బిగ్ బాస్ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బిగ్ బాస్ నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అని దువ్వాడ శ్రీనివాస్ నాకు చెప్పారు. శ్రీనివాస్‌కి అలాంటివి నచ్చవు. ఆయనకి డబ్బుపైన పెద్దగా ఆశ ఉండదు. మేము సినిమాలో నటించాం. కానీ వారి దగ్గర కూడా ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఫ్రీగానే యాక్ట్ చేశాం.’’ అని మాధురి లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె ఎంట్రీ, ఎలిమినేషన్‌ సహా ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు