Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. సోషల్ డ్రామా నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే బాలయ్య సూపట్ హిట్ టాక్ షో 'అన్స్టాపబుల్' పాల్గొన్న దుల్కర్ సల్మాన్ తన వ్యక్తిగతం, కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ ఆయన తండ్రి మమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి? అనే విషయాన్ని తెలిపారు.
Also Read: బాలీవుడ్ 'రామాయణం' పై అదిరిపోయే అప్డేట్.. 2 పార్టులుగా..పోస్టర్ వైరల్
అందుకే నాన్నతో సినిమా చేయలేదు..
'అన్స్టాపబుల్' షోలో బాలయ్య.. "మీ నాన్నతో స్క్రీన్ షేర్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి''? అని దుల్కర్ ను అడిగారు. దీనికి దుల్కర్ బదులిస్తూ.. ''నాతో యాక్ట్ చేయడానికి నాన్న ఇప్పటివరకూ అంగీకరించలేదు. కానీ ఆయనతో కానీ ఒక్కసారైనా నాన్నతో సినిమా చేయాలనే కోరిక ఉంది. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను'' అని తెలిపారు. దానికి బాలయ్య మీ ఇద్దరి సినిమాకు నేను స్క్రిప్ట్ రాస్తాను అంటూ సరదాగా నవ్వారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో అందుబాటులో ఉంది. మిస్సైన వారు ఇప్పుడు చూసేయండి.
ఇది ఇలా ఉంటే బాలయ్య 'అన్స్టాపబుల్' సీజన్ 4 ఫుల్ జోష్ లో ముందుకెళ్తోంది. సీజన్ 4లో మొదటి గెస్టుగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవగా.. సెకండ్ దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీమ్ హాజరయ్యారు. నెక్స్ట్ గెస్టుగా తమిళ్ స్టార్ సూర్య సందడి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే విడుదలైంది.
Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్
Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!