/rtv/media/media_files/2025/04/27/Xy00AIVaOrq2Iad0SALt.jpg)
Khalid Rehman Ashraf Hama
Malayala Directors మలయాళ డైరెక్టర్స్ ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హమా గంజాయితో పట్టుబడడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శనివారం అర్థరాత్రి కొచ్చిలోని తమ స్నేహితుడు సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్ ఫ్లాట్ లో గంజాయి సేవించేందుకు సిద్ధమవుతుండగా ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. వీరి నుంచి 1.25 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డైరెక్టర్స్ ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హమాతో పాటు వారి ఫ్రెండ్ సమీర్ తాహిర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్స్ ఇద్దరినీ స్టేషన్ బెయిల్ పై విడుదల చేయగా.. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఖలీద్, అష్రఫ్ ఇద్దరూ క్రమం తప్పకుండా గంజాయి వాడేవారట. అంతేకాదు వారికి రసాయన మత్తు పదార్థాలు అలవాటు కూడా ఉందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్ యూ టర్న్
ഹൈബ്രിഡ് കഞ്ചാവുമായി സംവിധായകന് ഖാലിദ് റഹ്മാനും അഷ്റഫ് ഹംസയും ഛായാഗ്രാഹകൻ സമീർ താഹിന്റെ കൊച്ചിയിലെ ഫ്ലാറ്റിൽ നിന്ന് പിടിയില്...
— Manorama News (@manoramanews) April 27, 2025
Read more at: https://t.co/Vt3wTkMJSq #KhalidRahman #director #malayalamfilm #excise #latestnewstoday #keralanewstoday pic.twitter.com/XKJrpGkdm3
ఇటీవలే 'జింఖానా'
ఇదిలా ఉంటే డైరెక్టర్ ఖలీద్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జింఖానా' ఇటీవలే విడుదలైంది. స్పోర్ట్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో పాటు 'తల్లుమాల' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు ఖలీద్. అలాగే డైరెక్టర్ అష్రఫ్ హాస్యం, భీమన్ వంటి సినిమాలతో పాపులర్ అయ్యారు.
telugu-news | latest-news | director Ashraf Hamza | director Khalid Rahman | ganja | malayalam-industry
Also Read: Akshaya Tritiya Gold Offers : అక్షయ తృతీయ లో బంగారం కొంటున్నారా? ఇదిగో మీకోసం ఆఫర్లే ఆఫర్లు