రజినీకాంత్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయింది.. సూపర్ స్టార్ పై దర్శకుడి ఆరోపణలు

డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'లింగ' సినిమా రజినీకాంత్ వల్లే ప్లాప్ అయిందని తీవ్ర ఆరోపణలు చేశారు.' ఎడిటింగ్‌ విషయంలో రజనీకాంత్‌ జోక్యం చేసుకున్నారు. గ్రాఫిక్స్ కు టైమ్ ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని మార్చి గందరగోళం చేశారు' అని అన్నారు.

New Update
ks

తమిళ సీనియర్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ పై (Rajinikanth) అగ్ర దర్శకుడు కె.ఎస్ రవికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ కాంబినేషన్లో వచ్చిన ఓ సినిమా విషయంలో రజినీకాంత్ జోక్యం చేసుకున్నారని, అందుకే ఆ సినిమా ప్లాప్ అయిందని అన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్‌ ఆ సినిమా పరాజయం గురించి మాట్లాడారు. ఇంతకీ అది ఏ సినిమా? అనే వివరాల్లోకి వెళ్తే..

కె. ఎస్ రవికుమార్ కోలీవుడ్ స్టార్  డైరెక్టర్స్ లో ఒకరు. ముఖ్యంగా రజినీకాంత్తో ఆయన తీసిన 'ముత్తు', 'నరసింహ' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు అందుకున్నాయి. మళ్ళీ వీరి కాంబోలో 2014 లో 'లింగ' (Linga Movie) అనే సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయెల్ రోల్ రోల్ నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేక పరాజయం అందుకుంది.

సెకండాఫ్ మార్చేశారు..

అయితే కె. ఎస్ రవికుమార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్లాప్ గురించి మాట్లాడుతూ.." ఎడిటింగ్‌ విషయంలో రజనీకాంత్‌ జోక్యం చేసుకున్నారు. సీజేఐ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌)కు నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని ఆయన మార్చేశారు. అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తొలగించేశారు. కృతిమంగా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ యాడ్‌ చేశారు. ‘లింగ’ను గందరగోళం చేశారు.." అని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇక ప్రస్తుతం రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ దసరాకు 'వేట్టయ్యన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'జై భీమ్' సినిమా దర్శకుడు టీ.జే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాలో మంజూ వారియర్, దగ్గుబాటి రానా, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: నా పిల్లలు సినిమాల్లోకా? కరెక్ట్ కాదు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు