ప్రముఖ నిర్మాత, రచయిత ప్రితీశ్ నంది(73) ముంబైలో గుండె పోటుతో కన్నుమూశారు. జర్నలిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ప్రితీశ్ రచయితగా, నిర్మాతగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా వ్యవహరించారు. ప్రితీశ్ సుర్, కాంటే, ఝంకార్ బీట్స్, చమేలీ, హజారోన్ ఖ్వైషీన్ ఐసీ, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇంకో వారం రోజుల్లో తన 74వ పుట్టిన రోజు ఉండగా.. ఇంతలోనే ఆయన గుండె పోటుతో మృతి చెందారు.
ఇది కూడా చూడండి: Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!
Rest in peace @PritishNandy … Was a privilege getting to know you during Pyar ke side effects… Brave, provocative, unique as a filmmaker & journalist/editor. Shall always think of you warmly. Sending love and prayers to the family 🙏🏼💔 #pritishnandy pic.twitter.com/dujmhO312o
— Sophie C (@Sophie_Choudry) January 8, 2025
ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్
టీవీ షోకి హోస్ట్‌గా కూడా..
ప్రితీశ్ నంది ఒక కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, ఫిల్మ్‌మేకర్‌గా, ఎడిటర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. దూరదర్శన్‌లో 1990లో ది ప్రితీశ్ నంది అనే టాక్ షోకి హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. ప్రితీశ్ నంది కమ్యూనికేషన్స్‌ను 2000లో ప్రారంభించి ఎన్నో సినిమాలు తీశారు.
ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి
@PritishNandy, poet, editor, film producer and more is no more.
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) January 8, 2025
He died today in Mumbai due to heart attack.
He was a game changer.
He injected tremendous energy into staid magazine journalism of early 80s. When he edited Illustrated Weekly of India we were awestruck.
Daring… pic.twitter.com/AgJsFgNuvz
ఇది కూడా చూడండి: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!