Dhruv Vikram: చియాన్ విక్రమ్ కొడుకు ప్లాన్ మాములుగా లేదుగా! రుక్మిణి వసంత్, శ్రీలీలతో క్రేజీ రామ్-కామ్..

“బైసన్” హిట్ తర్వాత ధ్రువ్ విక్రమ్ తెలుగులో రొమాంటిక్ కామెడీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో రుక్మిణి వసంత్, శ్రీలీల హీరోయిన్లుగా నటించనున్నారు. దీపక్ రెడ్డి దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

New Update
Dhruv Vikram

Dhruv Vikram

Dhruv Vikram: చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తాజాగా “బైసన్” అనే స్పోర్ట్స్ యాక్షన్ సినిమాతో భారీ హిట్ సాధించాడు. ఆ సినిమా విజయంతో ఆయన తర్వాతి ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. మొదట ఆయన మణిరత్నం దర్శకత్వంలో రొమాంటిక్ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ చిత్రంలో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తారని కూడా ప్రచారం జరిగింది.

Dhruv Vikram Rukmini Vasanth Rom-Com

ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం, ధ్రువ్ విక్రమ్ - రుక్మిణి వసంత్ కలిసి సినిమా చేయడం నిజమేనట. అయితే ఈ చిత్రానికి మణిరత్నం కాకుండా కొత్త దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. దీపక్ రెడ్డి తన షార్ట్ ఫిల్మ్ “మనసానమః”తో మంచి పేరు సంపాదించారు. ఈ కొత్త సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో మరో హీరోయిన్‌గా శ్రీలీల(SreeLeela) కూడా నటించనుందని టాక్.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో ధ్రువ్ విక్రమ్‌ను తెలుగులో పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ప్రాజెక్ట్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు