/rtv/media/media_files/2025/11/29/tere-ishk-mein-2025-11-29-15-27-03.jpg)
Tere Ishk Mein
Tere Ishk Mein: ధనుష్(Dhanush), కృతి సనన్(Kriti Sanon) జంటగా నటించిన “తేరే ఇష్క్ మేన్” సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. భారతదేశంలో ఈ సినిమా మొదటి రోజే ₹15 కోట్ల వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వచ్చిన ఈ బలమైన స్టార్ట్ చూసి, వీకెండ్లో కలెక్షన్లు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సినిమా ప్రమోషన్లు మంచి హైప్ సృష్టించాయి. ధనుష్- కృతి కెమిస్ట్రీ ట్రైలర్ నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందువల్ల పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. శనివారం, ఆదివారం రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగితే సినిమా మొదటి వీకెండ్ వసూళ్లు భారీగా ఉండనున్నాయి.
ఈ సినిమాలో శంకర్ గురక్కల్ అనే యువకుడి జీవితం, అతని భావోద్వేగాలు, అతని కోపానికి ఉన్న కారణాలు, ముక్తి అనే అమ్మాయి అతని జీవితంలో ఎలా మార్పు తీసుకువచ్చింది అన్నదే కథ. శంకర్ (ధనుష్) ఒక కాలేజీ స్టూడెంట్. ఆవేశం ఎక్కువ, మాటలకు మించిన చర్యలతో ఉండే వ్యక్తి. తన తండ్రి (ప్రకాశ్ రాజ్) మీద ఎంతో ప్రేమ ఉన్నా, తన ఆక్రోశం కారణంగా వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతాయి. చిన్నప్పుడే తన తల్లి మరణించడం అతని మనసుకు పెద్ద గాయంలా మారుతుంది. ఆ సంఘటనను మరచిపోలేకపోవడం అతని మనసును రగిలించిన ప్రధాన కారణం.
Also Read : రణ్వీర్ సింగ్ 'ధురంధర్' షాకింగ్ రన్‌టైమ్.. ఎన్ని గంటలంటే..?
ఇక ముక్తి బెహ్నినివాల్ (కృతి సనన్) సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్న యువతి. ఆమె థీసిస్‌లో ముఖ్యమైన విషయం మనిషిలో కోపం, హింస వంటి లక్షణాలను నియంత్రించవచ్చు అనేది. ఈ నమ్మకాన్ని నిజం చేయడానికి ఒక మంచి ఉదాహరణ కావాలి. ఆ సమయంలో కాలేజీలో ఒక చిన్న సంఘటనలో శంకర్ తన ముందే ఒక స్టూడెంట్ను కొట్టడం చూసి, అతడినే తన ‘కేస్ స్టడీ’గా తీసుకోవాలని నిర్ణయిస్తుంది.
ముక్తిని మొదటి సారి చూసిన క్షణం నుంచే శంకర్ గుండెల్లో ప్రేమ మొలకెత్తుతుంది. కానీ అతని ప్రేమ అతని గతం, అతని కోపం, అతని ఆవేశం ఇవన్నీ అతన్ని ఒక్కోసారి ప్రేమ నుండి దూరంగా తీసుకెళ్తాయి. శంకర్ గతం మీద ముక్తి చేసిన అధ్యయనం కథకు ఒక కొత్త మలుపు తీసుకొస్తుంది. అతని తల్లి మరణం వెనుక దాగిన నిజాలు, తండ్రితో ఉన్న బంధం, అతని జీవితం ఎలా మారిపోయిందన్నవి ఆడియెన్స్‌ను కదిలించేలా చూపించారు. ముక్తి మొదట శంకర్‌ను కేవలం ఒక పరిశోధన విషయంగా చూసినా, తర్వాత అతని మనసులో ఉన్న బాధను గమనించి అతని భావాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
Also Read: టాలీవుడ్లో మళ్లీ బిజీ అవుతోన్నరేణు దేశాయ్..? లేటెస్ట్ అప్డేట్ ఇదే!
2nd హాఫ్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను మరింతగా కథలోకి లాగుతాయి. లడఖ్‌లో జరిగే సన్నివేశాలు, శంకర్‌కు మెంటల్ హెల్త్ సర్టిఫికెట్ ఇవ్వాలనే పరిస్థితి వంటి అంశాలు సినిమా కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ముక్తి అతని ప్రేమను ఎలా అర్థం చేసుకుంది? శంకర్ ఎందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు? అతడిని ఆ దిశగా నడిపించిన కారణం ఎవరు? ఇవన్నీ సినిమా చివర్లో తెలుస్తాయి.
ధనుష్ మళ్లీ తన రేంజ్‌ను నిరూపించాడు. అతని ఆవేశం, మాట్లాడే తీరు, శరీర హావభావాలు అన్నీ ‘శంకర్’ అనే పాత్రను నిజమైన వ్యక్తిలా చూపించాయి. కొన్ని సన్నివేశాలలో అతని యాక్టింగ్ థియేటర్ మొత్తం నిశ్శబ్దం అయ్యేలా చేస్తుంది. కృతి సనన్ ఈ సినిమాలో గ్లామర్ కన్నా నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న రోల్ చేసింది. శంకర్‌కు సమానంగా భావోద్వేగ సన్నివేశాల్లో నటించి సినిమాకు బలం చేకూర్చింది. ప్రకాశ్ రాజ్, తోతా రాయ్, మహ్మద్ జీషాన్ అయ్యుబ్ వంటి నటులు తమ పాత్రల్లో మంచి పనితీరు చూపించారు.
ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. “తేరే ఇష్క్ మే”, “చిన్నావారే”, “ఆవారా అంగారా” పాటలు కథకు సరిపోయేలా అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ముఖ్య సన్నివేశాల్లో ఆడియెన్స్‌ను కథలోకి లాగుతుంది. సినిమాటోగ్రఫీ అద్భుతం. ముఖ్యంగా లడఖ్ సన్నివేశాలు అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా కథను సజావుగా నడిపేలా ఉంది. టీ సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ అధిక స్థాయి ప్రొడక్షన్ క్వాలిటీని చూపించాయి.
Follow Us