Dhanush : రజినీకాంత్ సినిమాలో ధనుష్.. డైరెక్టర్ ఎవరంటే?

రజినీకాంత్ 'జైలర్' మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ధనుష్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే ధనుష్ ను 'జైలర్ 2' కోసం సంప్రదించగా ఆయన వెంటనే ఓకే అన్నారట. అటు రజినీకాంత్‌‌ నుంచి అనుమతి కూడా పొందినట్టు తెలుస్తోంది.

dhanush
New Update

కోలీవుడ్ సు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) 'జైలర్' మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'జైలర్' లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ తో క్యామియోస్ చేయించి మ్యాజిక్ క్రియేట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్.. ఈసారి సీక్వెల్ లో అంతకుమించి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 'జైలర్ 2' (Jailer 2) కోసం మరో స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారట ఈ డైరెక్టర్.

మామ సినిమాలో అల్లుడు..

రజినీకాంత్ 'జైలర్ 2' లో కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్‌‌లో మామాఅల్లుళ్లైన వీళ్లిద్దరి కాంబినేషన్‌‌లో సినిమా చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ కాంబోను నెల్సన్ దిలీప్ సెట్ చేసినట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. 

Also Read: 'రాజా సాబ్' సర్పైజ్ వచ్చేసింది.. ప్రభాస్ నుంచి ఇది అస్సలు ఊహించలేదు

Also Read : స్టార్ హీరోయిన్‌ కి బలవంతంగా ముద్దుపెట్టిన హీరో!

రీసెంట్ గానే ధనుష్ ను 'జైలర్ 2' కోసం సంప్రదించగా ఆయన వెంటనే ఓకే అన్నారట. అటు ఈ విషయంపై రజినీకాంత్‌‌ నుంచి అనుమతి కూడా పొందినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. మరి ప్రస్తుతం తమిళ మీడియా వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతున్నా ఈ వార్తపై మూవీ టీమ్ నుంచి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Also Read: ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్

 రజినీకాంత్ ఇటీవలే ‘వేట్టయాన్‌‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ షూటింగ్  కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే 'జైలర్ 2' సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు 'హుకుం' అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 

Also Read: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం: ఈవో

 

#dhanush #rajnikanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe